PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmerprotestb026d212-9e71-4568-9d4f-a4d08204fc3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmerprotestb026d212-9e71-4568-9d4f-a4d08204fc3b-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత మంది రైతులతో సమావేశం అయిన ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారుfarmerprotest;delhi;korcha;narendra modi;prime minister;minister;central government;narendraవ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..farmerprotest;delhi;korcha;narendra modi;prime minister;minister;central government;narendraTue, 15 Dec 2020 21:25:08 GMTకేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత మంది రైతులతో సమావేశం అయిన ప్రధాని మోదీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతుల క్షేమం కోసం చారిత్రక నిర్ణయం తీసుకుందని, కానీ దాన్ని పెద్ద తప్పులా చూపిస్తున్న ప్రతిపక్షాలు.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. గుజరాత్‌లోని కచ్‌లో డీశాలినేషన్ ప్లాంట్, మిల్క్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్‌లకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ.. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.



ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలు అవి అధికారంలో ఉన్నపుడు ఈ వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగానే ఉన్నాయని మోదీ చెప్పారు. కాకపోతే వారి ప్రభుత్వ హయాంలో ఆ నేతలు ఈ నిర్ణయం తీసుకోలేక పోయారని ఆయన అన్నారు. నేడు దేశం ఓ చారిత్రాత్మక చర్య తీసుకుందని, ఇప్పుడు వీళ్లంతా గొంతు చించుకొని అరుస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తాము పండించే పంటలను అమ్ముకునే స్వేచ్ఛ చిన్నకారు రైతులకు ఎందుకు ఉండకూడదు? ఇదే ప్రశ్న ఈ ప్రతిపక్షాలను దేశం అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ సంస్కరణలు జరగాలనే డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉందని గుర్తు చేశారు. చాలా రైతు సంఘాలు కూడా తమ పంటలను తమకు నచ్చిన చోట అమ్ముకునే అవకాశం తమకు ఉండాలని డిమాండ్ చేశాయని పేర్కొన్నారు. నేడు ప్రతిపక్షంలో కూర్చున్న వారు రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని, వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్య బట్టారు. ఈ సంస్కరణలకు సదరు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండగా మద్దతు ఇచ్చాయని తెలిపారు.


ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>