Healthyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eluru-effect-follow-this-rulesaa71d7ba-d4d4-488a-9720-19785fabf459-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/eluru-effect-follow-this-rulesaa71d7ba-d4d4-488a-9720-19785fabf459-415x250-IndiaHerald.jpgఒకరు కాదు.. ఇద్దరు కాదు... వందల సంఖ్యలో ప్రజలు ఉన్నట్లుండి కళ్లుతిరిగి పడిపోవడం. మూర్ఛకు లోనవ్వడం.. ఎందుకు పడిపోయారో.. కారణం ఏంటో కూడా తెలియక పోవడం స్థానికులతో పాటు డాక్టర్లకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఏలూరులో... eluru;tara;vidya;mandula;pond;air;local language;pollution;house;eluru;march;v;panjaaఏలూరులో జరిగిందిందే.. మీరు పాటించాల్సిన జాగ్రత్తలివే!ఏలూరులో జరిగిందిందే.. మీరు పాటించాల్సిన జాగ్రత్తలివే!eluru;tara;vidya;mandula;pond;air;local language;pollution;house;eluru;march;v;panjaaTue, 15 Dec 2020 14:31:05 GMT

శరీరంలో సాధారణంగా అనేక లోహాలు ఉంటాయి. కానీ కొన్ని లోహాలు మాత్రం మన శరీరానికి ప్రమాదకరమైనవి. అలాంటి వాటిలో సీసం, కాడ్మియం, పాదరసం ప్రథమ స్థానంలో ఉంటాయి. అయినా మన శరీరాల్లో 25 మైక్రోగ్రాముల వరకూ సీసం ఉంటుంది. ఈ పరిమితి మించేకొద్దీ శరీరం మీద ఇది దుష్ప్రభావాలు చూపుతుంది. నిజానికి ఈ స్వల్ప మోతాదు సీసం కూడా ఒకేసారి శరీరంలోకి చేరినది కాదు. సుమారు 20 ఏళ్ల పాటు గాలి, నీరు, నేల.. వంటి మాధ్యామాల ద్వారా ఈ లోహాలు మన శరీరలోకి చేరతాయి. ఈ పరిమాణం మరింత పెరిగితే లోహ కాలుష్యానికి లోనై, కొద్దిపాటి నుంచి తీవ్ర అనారోగ్యాలకు గురవుతాం. ముఖ్యంగా ఈ లోహాలు శరీరంలోకి చేరే మార్గాలు..


కాలుష్య కారకాలు:
ఫ్యాక్టరీలు: ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థాలు, నీటిలో, నేలలో కలిసి, పంటలు కలుషితం అవుతాయి.
బొమ్మలు: చిన్నారుల ఆట వస్తువుల్లోని రబ్బరు బొమ్మల్లో కొద్ది మొత్తంలో సీసం ఉంటుంది.
బ్యాటరీలు: బ్యాటరీలు తయారుచేసే షాపుల ద్వారా కూడా సీసం అనధికారికంగా నేలలో కలుస్తుంది.
హౌస్ ఇంటీరియర్స్: విద్యుత్‌ ఉపకరణాల సోల్డరింగ్‌ కోసం సీసం వినియోగం జరుగుతుంది.


కూరగాయలు, పళ్లు: కాలుష్యంతో నిండిన ప్రాంతాల్లో పెరిగిన కూరగాయలు, పండ్లలో సీసం చేరుతుంది.
పాలు, పాల ఉత్పత్తులు: సీసం కలిసిన నీటితో పెరిగిన కలుషిత గడ్డి తినడం ద్వారా పశువుల్లోకి, వాటి పాల ద్వారా మన శరీరాల్లోకి సీసం చేరే వీలుంది.
మాంసాహారం: కలుషిత నీరు, గ్రాసం ఆహారంగా తీసుకున్న పశువులు, మేకల్లో సీసం స్థాయి పెరుగుతుంది. వాటి మాంసంలోనూ సీసం ఉంటుంది.
చేపలు: పాదరసం కలిసిన చెరువుల్లో పెరిగిన చేపల్లో ఈ లోహం చేరుతుంది.
నీళ్ల పైపులు: ఇంట్లో వాడే పైప్‌ లైన్లు, పెయింట్ల తయారీలోనూ సీసం ఉంటుంది.

వ్యవసాయ కారణాలు:
పురుగుమందుల తయారీలో ఉత్ర్పేరకంగా సీసం, నికెల్‌, పాదరసం వంటి లోహాలను వినియోగిస్తారు. ఇవి నేరుగా పురుగుమందుల్లోకి చేరకపోయినా వ్యర్థాల రూపంలో మట్టిలో, నీటిలో కలిసిపోతాయి. విషవాయువుల రూపంలో గాలిలోనూ కలుస్తాయి. అలాగే  ఆర్గానోఫాస్ఫరస్‌, ఆర్గానో క్లోరీన్‌, హెర్బిసైడ్స్‌ వంటి పురుగు మందులు పరిమితి మించితే ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి. అయితే ఈ రసాయనాలు కలిసి ఉండే ఎరువులు, పురుగుమందులను సరైన మోతాదుల్లో నీటితో కలిపి వాడితే ఏ ప్రమాదం ఉండదు. కానీ అధక దిగుబడి కోసం, పంట త్వరగా ఎదగడం కోసం వీటిని ఎక్కువ మోతాదుల్లో వాడుతుటారు. దీంతో ఆహారం ద్వారా ప్రమాదకర రసాయనాలు, పాదరసం శరీరంలోకి చేరిపోతాయి.

నకిలీ పంజా!
సింథటిక్‌ పాలు: వీటినే కృత్రిమ పాలు అని కూడా అంటారు. యూరియా ప్రధాన వస్తువుగా ఉపయోగించి తయారుచేసే సింథటిక్‌ పాలు ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ పాలను కనిపెట్టడం కష్టం. వీటిల్లో మంచి బ్యాక్టీరియా బతికే వీలు లేదు కాబట్టి పాలు తోడు పెడితే పెరుగుగా మారదు. కాబట్టి లాక్టోమీటరు సహాయంతో నకిలీ పాలను గుర్తించవచ్చు.

పసుపు, కారం: వీటిలో లెడ్‌ పెయింట్‌‌ను పొడిగా మార్చి కలుపుతారు. ఈ లోహాలు కలిసిన పసుపు, కారం నీటిలో పూర్తిగా కరగవు. పైనే తెట్టలా తేలుతాయి.
అల్యూమినియం ఫాయిల్‌: స్వీట్ల తయారీలో సిల్వర్‌ ఫాయిల్‌ బదులుగా అల్యూమినియంతో తయారైన ఫాయిల్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని నీటిలో వేస్తే ఉండలా మారుతుంది. ఇది కడుపులో చేరితే తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.


తీసుకోవలసిన జాగ్రత్తలు:
శ్వాస, ఆహారం, నీరు, చర్మం... వీటి ద్వారా ప్మాదకర రసాయనాలు, మరీ ముఖ్యంగా సీసం మన శరీరంలోకి చేరుతుంది. అలా జరగకూడదంటే..
పీల్చే గాలి నుంచి రక్షణ కోసం మాస్క్ కట్టుకోవడం, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు శుభ్రంగా కడిగి వినియోగించడం,
 చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం,
కూరగాయలు ఏ ప్రాంతంలో పడుతున్నాయో, మాంసం ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో తెలుసుకుని కొనుగోలు చేయడం,
ఫ్యాక్టరీలకు కనీసం 40 కి.మీటర్ల దూరంలో నివసించడం,
పాలు, పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల నాణ్యతను తెలుసుకుని కొనుగోలు చేయడం వంటి నియమాలు పాటించాలి.

ఇలా గుర్తించండి:
శరీరంలో లోహ కాలుష్యాన్ని, విషతుల్య రసాయనాలను గుర్తించేందుకు వ్యక్తి ఆరోగ్య లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. అక్యూట్‌, క్రానిక్‌, సబ్‌ క్రానిక్‌.. అనే మూడు దశల్లో ఈ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అక్యూట్‌ పాయిజనింగ్‌లో అయోమయం, వాంతులు, ఫిట్స్‌, లాలాజలం ఊరడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 12 ఏళ్ల లోపు పిల్లలు ఈ హెవీ మెటల్‌ పాయిజనింగ్‌కు గురయితే వారిలో జ్ఞాపకశక్తి, తెలివితేటలు తగ్గిపోతాయి. అలాగే రక్తం తయారయ్యే వ్యవస్థను దెబ్బతీసి రక్తహీనతకూ కారణమవుతాయి. మూత్రపిండాలు దెబ్బతిని రీనల్‌ ఫెయిల్యూర్‌ తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ(బ్లడ్ ప్రెజర్) సైతం పెరుగుతుంది. అయితే ఈ లక్షణాలన్నీ శరీరంలో లోహం పరిమాణం 40 నుంచి 80 మైక్రోగ్రాములకు చేరుకున్న తర్వాతే బయపడతాయి.

 అందువల్ల ముందునుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదిలా ఉంటే ఈ విషతుల్య పదార్థాలు మీ చుట్టుపక్కల ఉన్నట్లు జంతువుల ద్వారా కూడా గుర్తించవచ్చు. నివాస ప్రాంతాల్లో కాలుష్యం పరుచుకుందనే విషయం ఆ పరిసరాల్లో తిరిగే జంతువుల నడవడికను బట్టి పసిగట్టవచ్చు. ఆ ప్రాంతంలోని వీధికుక్కలు, పశువులు, పందులు వెనకకాళ్లు చచ్చుబడినట్టు ఈడుస్తూ నడుస్తుంటే, అది విషపూరిత రసాయనాల ప్రభావమని గ్రహించాలి. కాలుష్యానికి కారణమవుతున్న రసాయనాలు, లోహాల మూలాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.


దానికి సిద్దపడే పెళ్లి చేసుకున్నా.. కానీ పెళ్లి తరువాత..: సమంత

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>