SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/bjp-gvl-narasimharao-surgicalstrikes-hyderabadffc5ed71-2eb8-4a95-ade1-65ffabafd46c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/bjp-gvl-narasimharao-surgicalstrikes-hyderabadffc5ed71-2eb8-4a95-ade1-65ffabafd46c-415x250-IndiaHerald.jpgఅయితే బీజేపీ నేతలు మరచిపోయిందేమంటే మైండ్ గేమ్ లో పై రెండుపార్టీలు కూడా ఆరితేరిపోయాయని. తెలంగాణా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలు బీజేపీ మైండ్ గేమ్ లో చిక్కుకున్నాయి. కానీ అలాంటి పార్టీలు ఏపిలో లేవన్న విషయాన్ని బహుశా కమలనాదులు మరచిపోయినట్లున్నారు. నిజానికి గ్రేటర్ ఎన్నికలో తెలంగాణా అధ్యక్షుడు బండిసంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనే నినాదం బీజేపీనే రివర్సులో ఎదురుతన్నంది. సంజయ్ ఆ పదంవాడి జనాల్లో అలజడి రేపకుండా ఉండుంటే ఓల్డ్ సిటిలోని డివిజన్లలో కూడా బీజేపీకి మంచbjp gvl narasimharao surgicalstrikes hyderabad;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;geum;congress;rajya sabha;mp;tirupati;lotus;husband;mim party;ycp;partyహెరాల్డ్ సెటైర్ : సర్జికల్ స్ట్రైక్సే బీజేపీ కొంప ముంచేస్తాయా ?హెరాల్డ్ సెటైర్ : సర్జికల్ స్ట్రైక్సే బీజేపీ కొంప ముంచేస్తాయా ?bjp gvl narasimharao surgicalstrikes hyderabad;tiru;bharatiya janata party;telangana rashtra samithi trs;geum;congress;rajya sabha;mp;tirupati;lotus;husband;mim party;ycp;partyTue, 15 Dec 2020 07:00:00 GMT‘తెలంగాణాలో ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాం..ఏపిలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం’  ఇది తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్య. నిజానికి తెలంగాణాలో అయినా ఏపిలో అయినా సర్జికల్ స్ట్రైక్స్ చేసేంత సీన్ కమలంపార్టీకి లేదని అందరికీ తెలిసిందే. కాకపోతే ఏదో గాలివాటానికి అదృష్టం కూడా కలసిరావటంతో దుబ్బాక ఉపఎన్నికలో గెలిచింది. తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. ఇంతదానికే అదంతా తమ గొప్పతనమే అని, తమ పార్టీ బలపడిపోతోందనే భ్రమల్లో ఉన్నారు కమలనాదులు. ఈ నేపధ్యంలోనే ఏపిలో రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ భీకర ప్రకటన చేసింది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపు తమదే అంటు బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఇదంతా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలపై మైండ్ గేమ్ ఆడటంలో భాగమన్న విషయం అందరికీ తెలుసు.




అయితే బీజేపీ నేతలు మరచిపోయిందేమంటే మైండ్ గేమ్ లో పై రెండుపార్టీలు కూడా ఆరితేరిపోయాయని. తెలంగాణా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలు బీజేపీ మైండ్ గేమ్ లో చిక్కుకున్నాయి. కానీ అలాంటి పార్టీలు ఏపిలో లేవన్న విషయాన్ని బహుశా కమలనాదులు మరచిపోయినట్లున్నారు. నిజానికి గ్రేటర్ ఎన్నికలో తెలంగాణా అధ్యక్షుడు బండిసంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అనే నినాదం బీజేపీనే రివర్సులో ఎదురుతన్నంది. సంజయ్ ఆ పదంవాడి జనాల్లో అలజడి రేపకుండా ఉండుంటే ఓల్డ్ సిటిలోని డివిజన్లలో కూడా బీజేపీకి మంచి ఫలితాలే వచ్చేవని సమాచరం. ఎప్పుడైత సర్జికల్ స్ట్రైక్స్ అంటు బీజేపీ నానా హడావుడి చేసిందో నాన్ ముస్లింలు కూడా ఎంఐఎంకే ఓట్లేశారట.  




గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని నమ్ముకుని ఎంఐఎం నేతలతో ఎవరు గొడవపెట్టుకుంటారనే ఆలోచనలతోనే ఇష్టం ఉన్నా లేకపోయినా నాన్ ముస్లింల్లో ఎక్కువమంది ఎంఐఎంకే ఓట్లేశారట. గ్రేటర్ ఎన్నికల్లో కమలం పార్టీ గెలిచినా చేసేదేముండదు రోజు గొడవలు తప్ప. ఈ కారణంగానే సర్జికల్ స్ట్రైక్స్ అనే నినాదం ఎదురుతన్నిందన్నది ఓ విశ్లేషణ. ఇపుడు మళ్ళీ బీజేపీ నేతలు రెండు సర్జికల్ స్ట్రైక్స్ అంటూ గోల మొదలుపెట్టారు. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో ఓల్డ్ సిటిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నినాదం సరిపోయింది. అయితే అదే నినాదం ఏపిలో అందులోను తిరుపతి ఉపఎన్నికలో ఏ విధంగా చూసినా సూట్ కాదు. మరి ఆ విషయాన్ని ఆలోచించకుండానే జనబలం లేని జీవిఎల్ లాంటి నేతలు పదే పదే సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎదురుతన్నటం ఖాయమని అర్ధమైపోతోంది.





తిరుపతి ఉపఎన్నిక ముందస్తు ప్రణాళికలో భాగంగా జగన్ ప్లాన్ అదుర్స్!

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>