PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpgఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణలో అడుగుపెట్టిన కేసీఆర్ లో గతం కంటే ఇప్పుడు ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ గతంలో కంటే ఇప్పుడు పార్టీ బాగా బలహీనపడింది అనే విషయం కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వంపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, బిజెపి ఎన్నికల ముందు హడావుడి ఎక్కువగా చేయడం, టిఆర్ఎస్ శ్రేణులు బిజెపి సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయడం వంటి వ్యవహారాలు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు. ఇది ఇలా ఉంటే చాలా కాలంగా తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళన చేసి, సమర్థులైన వాkcr, telangana, trs, cabinet, minister kavitha;auto;kcr;ktr;kavitha;delhi;bharatiya janata party;telangana;government;cabinet;minister;letter;party;mantraకేబినెట్ ప్రక్షాళన దిశగా కేసీఆర్ ? వారందరికీ పదవి గండం ?కేబినెట్ ప్రక్షాళన దిశగా కేసీఆర్ ? వారందరికీ పదవి గండం ?kcr, telangana, trs, cabinet, minister kavitha;auto;kcr;ktr;kavitha;delhi;bharatiya janata party;telangana;government;cabinet;minister;letter;party;mantraTue, 15 Dec 2020 01:00:00 GMTఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణలో అడుగుపెట్టిన కేసీఆర్ లో గతం కంటే ఇప్పుడు ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ గతంలో కంటే ఇప్పుడు పార్టీ బాగా బలహీనపడింది అనే విషయం కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వంపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, బిజెపి ఎన్నికల ముందు హడావుడి ఎక్కువగా చేయడం, టిఆర్ఎస్ శ్రేణులు బిజెపి సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయడం వంటి వ్యవహారాలు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ గ్రహించారు. ఇది ఇలా ఉంటే చాలా కాలంగా తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళన చేసి, సమర్థులైన వారిని మంత్రులుగా నియమించాలని, అలాగే ప్రజావ్యతిరేకత ఎక్కువ ఉన్న వారిని, పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడని వారిని తప్పించాలని కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.




 ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి తో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన కవిత కు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో, క్యాబినెట్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదీ కాకుండా, ఇటీవల గ్రేటర్ ఎన్నికలలో ఇన్చార్జిగా కొన్ని డివిజన్లకు మంత్రులను నియమించారు. ఆ డివిజన్లలో చాలా మంది టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారు. అక్కడ బీజేపీ గెలుపొందడంతో సదరు మంత్రుల లో టెన్షన్ నెలకొంది.




 కాకపోతే కవిత ఇన్చార్జిగా ఉన్న డివిజన్ లో టిఆర్ఎస్ ఓటమి చెందడంతో, ఇప్పుడు కవితకు మంత్రి పదవి ఎలా ఇస్తారు అనే ప్రశ్న హైలెట్ అవుతుంది. కవిత కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఎప్పుడో డిసైడ్ అయిపోయారు అని , మిగతా మంత్రులలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారికి ఈ కేబినెట్ ప్రక్షాళనలో  డిమోషన్ తప్పదు అనే వార్తలు వస్తున్నాయి. అలాగే మంత్రిగా ఉన్న కేటీఆర్ కు సీఎం గా ప్రమోషన్ కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ మంత్రిమండలి ప్రక్షాళన పై చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మంత్రులందరి వ్యవహారశైలి పై ప్రజల్లో ఉన్న అభిప్రాయం , నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ లో ఉన్న సంతృప్తి, అసంతృప్తి ఇలా అన్నిటిని నిఘా వర్గాల ద్వారా సేకరించినట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే కొత్త మంత్రివర్గం కూర్పు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.



తెలంగాణ లో సరికొత్త సర్వే.. ప్రజలు అప్రమత్తం కావాల్సిందే.?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>