PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/supreme-court9d49142b-1b9d-40ad-b71f-75c3d5f3ab0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/supreme-court9d49142b-1b9d-40ad-b71f-75c3d5f3ab0e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం కలగనుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించినట్లు తెలిసిందిsupreme court;kumaar;maheswari;vidya;assam;guwahati;andhra pradesh;telangana;high court;october;chief commissioner of elections;raghavendraతెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం - సుప్రీం కోర్టు!తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం - సుప్రీం కోర్టు!supreme court;kumaar;maheswari;vidya;assam;guwahati;andhra pradesh;telangana;high court;october;chief commissioner of elections;raghavendraTue, 15 Dec 2020 22:40:00 GMTఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం కలగనుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించినట్లు తెలిసింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌లతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తీర్మానించినట్లు తెలిసింది.



ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్‌ గోస్వామిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా గోస్వామి ఉన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు ఏపీ సీఎం జగన్‌ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఏపీ నూతన చీఫ్ జస్టిస్‌గా అరూప్ కుమార్‌ గోస్వామిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అస్సాంకు చెందిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 1961లో జన్మించారు. గువాహటి యూనివర్సిటీలో ఎకానామిక్స్ (హానర్స్)లో 1981లో పట్టభద్రులయ్యారు. 1985లో గువాహటిలో ప్రభుత్వ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు.


బోయపాటి శ్రీను, బాలకృష్ణ సినిమా టైటిల్ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్..?

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>