PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chirala-ranarangam-si-pai-dhadichesina-mathsyakaruluf900863a-0f60-419f-b3cd-eb76d77ec984-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chirala-ranarangam-si-pai-dhadichesina-mathsyakaruluf900863a-0f60-419f-b3cd-eb76d77ec984-415x250-IndiaHerald.jpgగాయపడిన మత్స్యకారులను ఎంపి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పరామర్శించారు. పరామర్శ సమయం లోనూ ఒక మహిళ నేరుగా ఎంపీ మోపిదేవి ని విమర్శిస్తూ మాట్లాడింది. ఈ సందర్భంగా ఈపురు పాలెం ఎస్సై సుధాకర్ కారుపై మత్స్యకారులు రాళ్ళతో కొట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. si got hit by people;women;editor mohan;krishna;sampada;sudhakar;mopidevi venkata ramana;mp;village;king;car;mla;woman;sea;chirala;karanam balaramచీరాల రణరంగం: ఎస్సై పై దాడి చేసిన మత్స్యకారులు...!చీరాల రణరంగం: ఎస్సై పై దాడి చేసిన మత్స్యకారులు...!si got hit by people;women;editor mohan;krishna;sampada;sudhakar;mopidevi venkata ramana;mp;village;king;car;mla;woman;sea;chirala;karanam balaramTue, 15 Dec 2020 11:00:00 GMTసంపద కోసం కొనసాగుతున్న పోరాటం. ఒకళ్ళు మా జీవనాధారం కోసం చేస్తున్నామంటూ చెబుతుంటే... మరొకరు అదే జీవనాధారం భవిష్యత్తులోనూ కొనసాగాలంటూ ప్రస్తుతం మత్స్య సంపదను రక్షించుకోవడం అత్యవసరం అంటూ మండిపడుతున్నారు. విషయంలోకి వెళితే..ప్రకాశం జిల్లాలో చేపలవేట విషయం... మత్స్యకార గ్రామాల మధ్య వివాదాల పోరు ఏ మాత్రం సద్దుమణగడం లేదు. గొడవల స్థాయి తీవ్ర రేఖను దాటుతోంది. ఈ వివాదానికి మూల కారణం సముద్రంలో మత్స్యసంపదకి హానికరంగా మారిన "బల్లవల" వాడకం అన్నది తెలిసిందే. వాడరేవు మత్స్యకారులు వాడుతున్న బల్లవలలను ఇతర గ్రామాలకు చెందిన మత్స్యకారులు  ఖండిస్తున్నారు.

అటువంటి వలలను వాడడం వల్ల చిన్న చేపలు సైతం అందులో చిక్కుకొని... భవిష్యత్తులో సముద్రంలోని మత్స్య సంపద మెల్ల మెల్లగా తగ్గి పోతున్నది అన్నది వారి వాదన. ఇది ఎవరికీ మంచిది కాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మత్స్యకార గ్రామాల్లో బల్లవలల వినియోగంపై నాలుగేళ్ల క్రితం నిషేధం విధించారు. కానీ వాటిని తిరిగి మళ్ళీ వినియోగంలోకి తీసుకురావడంతో ఈ వివాదం మొదలైంది. చీరాల మండలం వాడరేవు మత్స్యకారులు సాధారణ వలలో చేపలు సరిగా చిక్కడం లేదంటూ తిరిగి మూడేళ్ల కిందట వీటిని వాడటం ప్రారంభించారు. దీంతో ఇరు గ్రామస్తుల మధ్య వివాదం రాజుకుంది. వాడరేవు  మత్స్యకారులపై కఠారివారిపాలెం మత్స్యకారులు దాడి చేశారు.

దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ చీరాలలో ఆందోళన జరిగింది. దీనిపై యాక్షన్ తీసుకున్న పోలీసు అధికారులు కఠారివారిపాలెంకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.  అంతేకాకుండా సముద్రంలో మత్స్య వేటకి బల్లవల, ఐలా వలలను వినియోగించరాదని నిషేధం విధిస్తూ హెచ్చరించారు. వాడరేవు గ్రామంలో వివాదంలో గాయపడిన మత్స్యకారులను ఎంపి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పరామర్శించారు. పరామర్శ సమయం లోనూ ఒక మహిళ నేరుగా ఎంపీ మోపిదేవి ని విమర్శిస్తూ మాట్లాడింది. ఈ సందర్భంగా ఈపురు పాలెం ఎస్సై సుధాకర్ కారుపై మత్స్యకారులు రాళ్ళతో కొట్టి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇదంతా చూస్తుంటే ఈ మత్స్యకారుల వివాదం ఇప్పుడు అప్పుడే ఓ కొలిక్కి వచ్చేలా లేదు.


ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>