PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi654885ad-9e4c-4b32-baf4-5996b0b81297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi654885ad-9e4c-4b32-baf4-5996b0b81297-415x250-IndiaHerald.jpgదుబ్బాక , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారని విజయశాంతి ఎద్దేవా చేసారు. మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమ కాలంలో నినదించి, అధికార పగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ కు బీజేపీ విజయాలు దడ పుట్టించాయని అందుకే నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని అన్నారు. vijayashanthi;view;kcr;vijayashanti;delhi;hyderabad;bharatiya janata party;warangal;telangana;congress;mp;government;huzur nagar;media;nalgonda;chief minister;ranga reddy;central government;mahbubnagarతెలంగాణలో కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదట...!తెలంగాణలో కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదట...!vijayashanthi;view;kcr;vijayashanti;delhi;hyderabad;bharatiya janata party;warangal;telangana;congress;mp;government;huzur nagar;media;nalgonda;chief minister;ranga reddy;central government;mahbubnagarTue, 15 Dec 2020 21:30:04 GMTకాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి తన దూకుడు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీ, సిద్ధిపేట పర్యటనలపై విమర్శలు గుప్పించిన విజయశాంతి... తాజాగా బుధవారం తెలంగాణలో కొత్త పోస్టుల భర్తీపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణలో కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని అన్నారు. అటు దుబ్బాక ఉప ఎన్నికలో,, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేసారు.

ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసి పడేసిన సీఎం కేసీఆర్ ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారని విమర్శించారు.  మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమ కాలంలో నినదించి, అధికార పగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ కు బీజేపీ విజయాలు దడ పుట్టించాయని అందుకే నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని అన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.  టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్ర హోం శాఖ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని తెలిపాడు. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయని, ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని విజయ శాంతి అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని  మోసాల ముఖ్యమంత్రి గమనించాలని అన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన బీజేపీ  రానున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ మరియు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు  తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం వెనుక గ్రాడుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం ఉందని బీజీపీ ఆరోపిస్తోంది. ఇక ఇదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం  చేస్తోంది.


కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>