PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy728bf5af-7758-47e7-a3a0-b07a17746d65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy728bf5af-7758-47e7-a3a0-b07a17746d65-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నగరంలో అత్యంత డీలా పడిపోయింది .. అతి తక్కువ స్థానాలలో సీటు సంపాదించడం తో పాటు నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి .. ఇది ఇలాగే ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారే ప్రమాదం ఉంది..revanth reddy;kumaar;rahul new;rahul;revanth;hyderabad;k l rahul;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;tpcc;rahul sipligunj;reddy;partyఢిల్లీకి పయనమవుతున్న రేవంత్ రెడ్డి. పీసీసీగా అతడేనా ?ఢిల్లీకి పయనమవుతున్న రేవంత్ రెడ్డి. పీసీసీగా అతడేనా ?revanth reddy;kumaar;rahul new;rahul;revanth;hyderabad;k l rahul;telangana;revanth reddy;congress;mp;రాజీనామా;tpcc;rahul sipligunj;reddy;partyTue, 15 Dec 2020 23:14:45 GMTహైదరాబాద్ లో  కాంగ్రెస్ పార్టీ నగరంలో అత్యంత డీలా పడిపోయింది ..  అతి తక్కువ స్థానాలలో సీటు సంపాదించడం తో పాటు నగరంలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి .. ఇది ఇలాగే ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.. కాబట్టి తెలంగాణ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే అలాగే రాష్ట్రంలో  మళ్ళీ కాంగ్రెస్ కార్యకలాపాలను పుంజుకునేలా సమర్థవంతంగా పని చేసే ఒక సారధి  కావాలి.. అది కూడా అధిష్టానం పేరును ఎంత తొందరగా ప్రకటిస్తే అంత మంచిది .. ..    దుబ్బాక ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  దారుణంగా ఓడిపోయారో మీకు తెలుసు అదే పరిస్థితి గ్రేటర్ ఎన్నికల్లోను రిపీట్ కావడంతో  హఠాత్తుగా  టిపిసిసి పదవి కి  ఉత్తమ కుమార్ రెడ్డి  రాజీనామా చేశారు..  దీంతో తర్వాత టిపిసిసి అధ్యక్షుడు ఎవరు అనేదానిపై పార్టీలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన  పలువురు సీనియర్ నాయకులు ఈ పదవి కోసం ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు ..  పీసీసీ పదవి తమదే అంటూ ప్రకటనలు చేస్తున్నారు ..  ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ మాణికం టాగూర్ కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో పలు  కాంగ్రెస్ నాయకులతో  సమావేశాలు జరిపి వారి  అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి ఒక నివేదిక రూపంలో సమర్పించారు...

ఈ నివేదికపై అధిష్టానం సమాలోచనలు చేస్తోంది.. టిపిసిసి అధ్యక్షుడిగా కొందరి  పేర్లు వినబడుతున్న చివరికి ఎవరికి ఆ పదవి  దక్కుతుందో వేచి చూడాల్సిందే... దీనిపై అధిష్టానం తొందరలో ఒక నిర్ణయం తీసుకోనుంది .. ఇదిలా ఉండగా మల్కాజ్ గిరి  ఎంపీ  రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి పయనమవుతున్నారు.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి  వెళ్లడంతో టీపీసీసీ పదవి అతడికే కాయమవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం  వినబడుతున్నాయి .. .. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరిగే డిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొనబోతున్నారు... ఆ  మీటింగ్ విషయమై రేవంత్ రెడ్డి  ఢిల్లీకి వెళ్తున్నారు.. ఎట్టకేలకు  రేపటిలోగా టిపిసిసి పదవిపై ఒక క్లారిటీ మాత్రం రానుంది ..  టీపీసీసీ రేసులో నిలబడే నాయకుల్లో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండటం విశేషం .. అయితే రేపు ఎవరి పేరు వినబడబోతుందో చూడాలి .. 


మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>