PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr9b51848a-5280-4d76-9814-dfe66edeacd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kcr9b51848a-5280-4d76-9814-dfe66edeacd7-415x250-IndiaHerald.jpgస‌రే! ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. దుబ్బాక ఉప ఎన్నిక జ‌రిగింది. ఇక్క‌డ బీజేపీ వ్యూహాత్మ‌క విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో బీజేపీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. ఆపార్టీని మ‌త‌త‌త్వ పార్టీగా అభివ‌ర్ణించారు. అంతేకాదు, రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌ర‌కి.. మ‌రింత‌గా వేడి పెంచారు కేసీఆర్‌. బీజేపీత‌న‌కు ప్ర‌ధాన శ‌త్రువుగా మారుతోంద‌ని గ్ర‌హించి.. kcr;view;modi;amit shah;kcr;bharatiya janata party;telangana;media;minister;letter;central governmentసోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!kcr;view;modi;amit shah;kcr;bharatiya janata party;telangana;media;minister;letter;central governmentTue, 15 Dec 2020 11:46:43 GMTతెలంగాణ సార‌థి, టీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న అనుస‌రించిన వ్యూహం బెడిసి కొట్టింది. అటు ప్ర‌తిప‌క్షాల‌కు, ఇటు సోష‌ల్ మీడియాకు కూడా ఆయ‌న అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్ వ‌ర్గాల‌కు కూడా ఏం చేయాలో అర్ధం కావ‌డం లేదట‌!  మా అధినేత‌పైనే ఇలా కామెంట్లు చేస్తారా? అని వ్యాఖ్యానించేందుకు కూడా వారికి ఛాన్స్ ఇవ్వ కుండా సోష‌ల్ మీడియా జ‌నాలు విరుచుకుప‌డుతున్నారు. దీంతో కేసీఆర్ ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు.

స‌రే! ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. దుబ్బాక ఉప ఎన్నిక జ‌రిగింది. ఇక్క‌డ బీజేపీ వ్యూహాత్మ‌క విజ‌యం ద‌క్కించుకుంది. కానీ, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో బీజేపీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు.  ఆపార్టీని మ‌త‌త‌త్వ పార్టీగా అభివ‌ర్ణించారు. అంతేకాదు, రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చేస‌ర‌కి.. మ‌రింత‌గా వేడి పెంచారు కేసీఆర్‌. బీజేపీత‌న‌కు ప్ర‌ధాన శ‌త్రువుగా మారుతోంద‌ని గ్ర‌హించి.. ఇటు రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కులు, అటు కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై ఒంటికాలిపై విరుచుకుప‌డ్డారు. దీంతో కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ కుమ్ములాట‌ను అంద‌రూ ఎంజాయ్ చేశారు.

క‌ట్ చేస్తే.. ఇది జ‌రిగి ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా ముగియ‌క‌ముందే.. కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల వ‌ద్ద‌కు వెళ్లారు కేసీఆర్‌. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టారు. గ‌ద్వాల్ వ‌స్త్రాల‌తో ఇద్ద‌రు నాయ‌కు ల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు.  దీనిని త‌న అనుకూల మీడియా స‌హా, సొంత మీడియాలోనూ భారీగా ప్ర‌చారం చేయించుకున్నా రు. ఇంకేముంది.. రాష్ట్ర స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతున్నాయ‌ని సొంత మీడియా మోసేసింది. మ‌ళ్లీ క‌ట్ చేస్తే.. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. ఎందుకంటే.. గ్రేట‌ర్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ, దుబ్బాక ఉప పోరులోను కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు .. ఇంకా ప్ర‌జ‌ల చెవుల్లో మార్మోగుతున్నాయి. పైగా.. ఆయ‌న బీజేపీపై ప్ర‌క‌టించి యుద్ధాన్ని ఇంకా వారు మ‌రిచిపోలేక పోతున్నారు.

కానీ, ఇంత‌లోనే బీజేపీ పెద్ద‌ల‌కు వంగి వంగి ద‌ణ్ణాలు పెట్ట‌డం విస్మ‌యాన్ని క‌లిగింది. ఇక‌, ప్ర‌తికూల మీడియా అయితే.. ఓ రేంజ్‌లో కేసీఆర్ వంగి వంగి పెట్టిన ద‌ణ్ణాల వీడియోను ప‌దేప‌దే ప్ర‌సారం చేసింది. ఇక‌, బీజేపీ నాయ‌కులు ఏకంగా.. ``ఎప్ప‌టికైనా మా కాళ్లు మొక్కాల్సిందే!`` అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఈ విష‌యంపై సోష‌ల్ మీడియా జ‌నాలు కూడా భారీగానే రియాక్ట్ అయ్యారు. ఏందిది కేసీఆర్‌.. ``నిన్న‌తిడితివి.. నేడు పెడితివి.. దండం!!``- అంటూ కామెంట్లు కుమ్మెస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ నాయ‌కులు ర‌గిలిపోతున్నా.. ఏం మాట్లాడితే.. ఏం జ‌రుగుతుందోన‌ని వెన‌క్కి త‌గ్గుతున్నారు. ఇదీ సంగ‌తి..!!




ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>