MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi790b31a1-3127-43bd-846b-1abb12f264d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi790b31a1-3127-43bd-846b-1abb12f264d9-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ. ఆరు పాటలు, అయిదు ఫైట్లు, మాస్ సన్నివేశాలు, మేనరిజమ్స్.. ఇవే ఉంటాయి. chiranjeevi;chiranjeevi;kodi ramakrishna;ramakrishna;cinema;genre;remake;allu sneha;mass;masterఈ సినిమాతో చిరంజీవికి మరో టర్నింగ్ పాయింట్..!?ఈ సినిమాతో చిరంజీవికి మరో టర్నింగ్ పాయింట్..!?chiranjeevi;chiranjeevi;kodi ramakrishna;ramakrishna;cinema;genre;remake;allu sneha;mass;masterTue, 15 Dec 2020 09:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ. ఆరు పాటలు, అయిదు ఫైట్లు, మాస్ సన్నివేశాలు, మేనరిజమ్స్.. ఇవే ఉంటాయి. చిరంజీవి సినిమాపై సగటు తెలుగు ప్రేక్షకుడి ఆలోచనలు ఇవే. ఈ అంశాలే చిరంజీవిని మెగాస్టార్ ను చేశాయి.

ఇక చిరంజీవి 1992లో ఘరానామొగుడు తర్వాత 1996లో చేసిన రిక్షావోడు వరకూ చేసిన 8 సినిమాల్లో కేవలం ముఠామేస్త్రి, అల్లుడా మజాకా మాత్రమే హిట్ అయ్యాయి. అన్నీ కమర్షియల్ ఫార్మాట్లే. ఏ జోనర్ తనను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిందో అదే ఫార్మాట్ చిరంజీవికి ప్రతిబంధకంగా మారింది. తన సినిమా అంటే ఫైట్లు, పాటలు, మాస్, దాదాపు ప్రతి ఫ్రేములో తానుండాలి.. వీటన్నింటినీ పక్కకు పెట్టారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు ఫ్లాప్ తో ఏకంగా ఏడాది పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కెరీర్లో అప్పటివరకూ ఎప్పుడూ సినిమా రాని ఏడాది లేదు. కానీ.. 1996లో ఏ సినిమా చేయకుండా ఎటువంటి సినిమా చేయాలో ఆలోచించారు ఆయన .

అయితే మళయాళంలో హిట్ అయిన హైఎండ్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘హిట్లర్’ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దర్శకుడిగా సాఫ్ట్, ఫ్యామిలీ మూవీస్ డైరక్టర్ గా ముత్యాల సుబ్బయ్యను ఎంచుకున్నారు. ఇవన్నీ చిరంజీవి సినిమాకు ఉండాల్సినవి కాదు.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసేవి కావు. కానీ.. చిరంజీవి ఆలోచన, అనుభవం వర్కౌట్ అయ్యాయి. హిట్లర్ హిట్. అదే ఫార్ములాను ఉపయోగిస్తూ.. కథ, కథనం, తన మార్క్ అంశాలతో వరుసగా చేసిన మాస్టర్, బావగారూ.. బాగున్నారా, చూడాలని వుంది, స్నేహం కోసం.. ఇలా వరుస హిట్లతో దూసుకుపోయారు. ‘రిక్షావోడు’ ఫ్లాప్ కూడా చిరంజీవికి అలా కలిసొచ్చిందనే చెప్పాలి.




ఆసీస్ కి పెద్ద షాక్.. ఆ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ నుంచి ఔట్...

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>