MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/those-two-were-set-beside-pawan-and-mahesh-moviesf92bf44a-f08a-4f9e-b934-652e30111064-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/those-two-were-set-beside-pawan-and-mahesh-moviesf92bf44a-f08a-4f9e-b934-652e30111064-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక వీరిద్దరి సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్, అలానే కలెక్షన్స్ గురించి మన తెలుగు ప్రేక్షకుల తో పాటు పలు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా పూర్తిగా తెలుసు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకుంటూ పోతున్న ఈ ఇద్దరూ కూడా తమ తమ కెరీర్స్ లో చాలానే బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. pawankalyan;maheshbabu;pawan;mahesh;kalyan;kushi;pawan kalyan;india;tollywood;cinema;rajani kanth;bahubali;media;history;blockbuster hit;pokiriమళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??pawankalyan;maheshbabu;pawan;mahesh;kalyan;kushi;pawan kalyan;india;tollywood;cinema;rajani kanth;bahubali;media;history;blockbuster hit;pokiriTue, 15 Dec 2020 23:37:46 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక వీరిద్దరి సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్, అలానే కలెక్షన్స్ గురించి మన తెలుగు ప్రేక్షకుల తో పాటు పలు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా పూర్తిగా తెలుసు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకుంటూ పోతున్న ఈ ఇద్దరూ కూడా తమ తమ కెరీర్స్ లో చాలానే బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు.

అయితే వాటిలో సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా పోకిరి, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో నిలిచిపోయే సినిమా ఖుషి. అప్పట్లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అనంతరం సాధించిన గొప్ప విజయం, కొల్లగొట్టిన రికార్డ్స్, అలానే సంపాదించిన కలెక్షన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమాల రాక తరువాత తెలుగు సినిమా యొక్క పరిధి మరింతగా పెరగడంతో పలువురు హీరోలు సైతం అటువైపే చూస్తున్నారు.

అయితే ఎంత పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పటికీ కూడా పోకిరి, ఖుషి సినిమాలకు ఒకవేళ రాబోయే రోజుల్లో సీక్వెల్స్ కనుక రూపొందితే ఇక వాటికీ వచ్చే ఓపెనింగ్స్, కలెక్షన్స్ కి అడ్డుకట్ట వేయడం ఎవరి తరం కాదని, ఆ విధంగా మళ్ళి టాలీవుడ్ బాక్సాఫీస్ లో పాత రికార్డ్స్ ని దుమ్ముదులిపి సరికొత్త అధ్యాయాన్ని లిఖించగల సత్తా ఆ రెండు సినిమాలకు ఉందని పలువురు పవన్, మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి వారందరూ భావిస్తున్నట్లు ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్  వస్తాయో లేదో తెలియాలంటే వాటికీ కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు విశ్లేషకులు....!!


భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>