MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf4f36986-fd2e-49a8-80ae-1a8ca721a6d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrrf4f36986-fd2e-49a8-80ae-1a8ca721a6d5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అని చెప్పక తప్పదు. దర్శకధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మన్యం వీరుడిగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. rrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;bahubali;nandamuri taraka rama rao;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;chitramఆర్ఆర్ఆర్‌లో తారక్ షాకింగ్ గెటప్?ఆర్ఆర్ఆర్‌లో తారక్ షాకింగ్ గెటప్?rrr;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;bahubali;nandamuri taraka rama rao;seetharamaraju;alluri seetha rama raju;seetharama raju;chitramMon, 14 Dec 2020 18:12:26 GMTసినిమా ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అని చెప్పక తప్పదు. దర్శకధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మన్యం వీరుడిగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ నటులు అలియా భట్, అజయ్ దేవగన్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. బాహుబలి చిత్రంతో అటు బాలీవుడ్‌లోనూ రాజమౌళి తన సత్తాను చాటాడు.

దీంతో ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు టీజర్ల ద్వారా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా జూనియర్ ఎన్టీ ఆర్ ఎలా ఉండబోతున్నారనేది అర్థమైంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీజర్‌లో ఆయన చివరలో ముస్లిం గెటప్ వేసుకోవడాన్ని గమనించవచ్చు. ఆ గెటప్ చూశాక జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన నటవిశ్వరూపం చూపించబోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓ వృద్దుడి పాత్రలో కూడా నటించబోతున్నట్టు ఇప్పుడో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఇది కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ అసలైన నటవిశ్వరూపాన్ని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు. కాగా.. కరోనా కారణంగా ఆరు నెలలకు పైగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కు బ్రేకులు పడిన విషయం తెలిసిందే. ఇటీవల మళ్లీ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మహాబలేశ్వర్‌లో జరుగుతున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి లేకపోతే ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ చివర్లో ఉండగా.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు.


పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>