PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratescdbd9409-e255-4308-8f4c-1d50e5121138-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratescdbd9409-e255-4308-8f4c-1d50e5121138-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాడులోని ప్ర‌సిద్దిగాంచిన కుళంబేశ్వర ఆలయం మ‌ర‌మ్మ‌తుల ప‌నుల్లో భాగంగా నిర్వ‌హిస్తున్న త‌వ్వ‌కాల్లో భారీగా బంగారం బ‌య‌ట‌ప‌డింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్‌లో రెండో కులోత్తుంగ చోళన్‌ కాలంలో నిర్మించిన ఆల‌యంలో గుప్త నిధులు ఉన్నాయంటూ వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. అయితే ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతున్న అధికారులు ప‌రిస‌రాల్లో త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. జేసీబీతో ఆలయంలో ఉన్న మూలవిరాట్టు సన్నిధి ఎదుట ఉన్న రాతి మెట్లను తొలగిస్తుండగా వస్త్రంలో చుట్టి ఉంచిన బంగారు ఆభరణాల gold;nidhi;tiru;vidya;tiruchirappalli;district;police;tamilnadu;letter;local languageత‌మిళ‌నాడులో ఆల‌యం త‌వ్వ‌కాల్లో భారీగా బ‌య‌ట‌ప‌డిన బంగారం.. ఎంతో తెలుసా..?త‌మిళ‌నాడులో ఆల‌యం త‌వ్వ‌కాల్లో భారీగా బ‌య‌ట‌ప‌డిన బంగారం.. ఎంతో తెలుసా..?gold;nidhi;tiru;vidya;tiruchirappalli;district;police;tamilnadu;letter;local languageMon, 14 Dec 2020 08:09:24 GMTజిల్లా ఉత్తిరమేరూర్‌లో రెండో కులోత్తుంగ చోళన్‌ కాలంలో నిర్మించిన ఆల‌యంలో గుప్త నిధులు ఉన్నాయంటూ వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో ప్ర‌చారంలో ఉంది. అయితే ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను చేప‌డుతున్న అధికారులు ప‌రిస‌రాల్లో త‌వ్వ‌కాలు చేప‌ట్టారు. జేసీబీతో ఆలయంలో ఉన్న మూలవిరాట్టు సన్నిధి ఎదుట ఉన్న రాతి మెట్లను తొలగిస్తుండగా వస్త్రంలో చుట్టి ఉంచిన బంగారు ఆభరణాల మూట బయటపడింది. విషయం తెలిసి వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులకు బంగారాన్ని ఇవ్వడానికి స్థానికులు నిరాకరించారు. మొత్తం రెండు కిలోలకుపైగా ఉంటాయని భావిస్తున్నారు.


దీంతో అధికారులు వెనుదిరిగారు. కాంచీపురం ఆర్డీవో విద్య, అధికారులు ఆదివారం వెళ్లి నిర్వాహకులతో చర్చించారు. మహాకుంభాభిషేక నిర్వహణ సమయంలో ఆభరణాలను ఆలయానికి తీసుకురావాలనే షరతు మేరకు నిర్వాహకులు వాటిని అప్పగించారు. భద్రత కోసం అప్పట్లో ఆలయ నిర్వాహకులు మందిరం గోడల్లో, ఇతర ప్రాంతాల్లో నగలను దాచి ఉంచవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా జంబుకేశ్వర్‌ ఆలయంలో పురాతన కాలం నాటి బంగారు నాణేలు బయటపడ్డ విషయం తెలిసిందే. అఖిలాండేశ్వరి సన్నిధి చుట్టూ గార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు తవ్వకాలు జరిపుతుండగా ఓ కుండలో నాణేలు బయటపడ్డాయి. తాజాగా, తమిళనాడులోని మరో ఆలయంలో గుప్త నిధులు వెలుగుచూడ‌టం గ‌మ‌నార్హం.  


ఉత్తరమేరూర్‌లోని కులంబేశ్వరర్ ఆలయాన్ని రెండో కులోత్తోంగచోలుడు కాలంలో నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. విదేశీయుల దాడి నుంచి స్వామి విగ్రహాలను అలంకరించడానికి తయారు చేసిన నగలు ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు.ది పురాతన ఆలయం కాబట్టి నిధులు ప్రభుత్వానికే చెందాలని అధికారులు వాదిస్తున్నారు. కాగా, ప్రస్తుతం బయటపడ్డ నిధి నిక్షేపాలు పల్లవుల కాలం నాటివని భావిస్తున్నారు. ఇంకా మరింత సంపదలు దొరుకుతాయేమోనని తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 




నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>