PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycplo-aa-iddari-ragada-mudirindiga-jagan-cheppina-vinatledu467ff49f-6f7e-4e95-8aed-7f955f4a0f76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycplo-aa-iddari-ragada-mudirindiga-jagan-cheppina-vinatledu467ff49f-6f7e-4e95-8aed-7f955f4a0f76-415x250-IndiaHerald.jpgఅయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌నుల‌కు ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న నిధుల‌కు పొంత‌న లేక పోవ‌డం, ఎమ్మెల్యే ఎవ‌రికీ అంద‌నంత దూరంలో(బెంగ‌ళూరు) ఉండ‌డం, అధికారులు కూడా ఆయ‌న‌కు త‌ప్ప తాము ఎవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎమ్మెల్యే వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది. గ‌డిచిన ఏడాదిలో(అంటే.. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన‌ తొలి ఆరు మాసాలు తీసేయ‌గా) క‌నిగిరిలో జ‌రిగిన అభివృద్దిపై సాధార‌ణ ప్ర‌జ‌ల మాట అటుంచితే.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి ప‌లు సందేహాలు వ్య‌క్తం ycp mla;district;mla;letter;local language;ycp;partyఎవ్వరికి అంద‌నంత దూరంలో వైసీపీ ఎమ్మెల్యే... ఏం చేస్తున్నాడో తెలుసా..!ఎవ్వరికి అంద‌నంత దూరంలో వైసీపీ ఎమ్మెల్యే... ఏం చేస్తున్నాడో తెలుసా..!ycp mla;district;mla;letter;local language;ycp;partyMon, 14 Dec 2020 09:47:35 GMTప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్ రాజ‌కీయాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా యి. నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న త‌ను క‌నుస‌న్న‌ల్లో శాసిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు ఈ విష‌యంలో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. త‌మ‌కు క‌నీసం చిన్న‌ చిన్న ప‌నులు కూడా ఇవ్వ‌డం లేద‌ని.. అన్నీ ఆయ‌నే చేసుకుంటున్నార‌ని.. ఫ‌లితంగా తాము పార్టీలో ఉన్నా.. ఆయ‌న కోసం ప్ర‌చారం చేసినా .. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌యోజనం ల‌భించ‌లేద‌ని వారు వాపోతున్నారు. అయినా.. మ‌ధు సూద‌న్ యాద‌వ్ ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న ప‌నేదో తాను చేసుకుపోతున్నారు.

అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌నుల‌కు ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్న నిధుల‌కు పొంత‌న లేక పోవ‌డం, ఎమ్మెల్యే ఎవ‌రికీ అంద‌నంత దూరంలో(బెంగ‌ళూరు) ఉండ‌డం, అధికారులు కూడా ఆయ‌న‌కు త‌ప్ప తాము ఎవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎమ్మెల్యే వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేస్తోంది. గ‌డిచిన ఏడాదిలో(అంటే.. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డిన‌ తొలి ఆరు మాసాలు తీసేయ‌గా) క‌నిగిరిలో జ‌రిగిన అభివృద్దిపై సాధార‌ణ ప్ర‌జ‌ల మాట అటుంచితే.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర‌న‌ర‌సింహారెడ్డి ప‌లు సందేహాలు వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గానికి భారీ ఎత్తున నిధులు తెచ్చి.. బుర్రా అభివృద్ది చేస్తున్నారంటూ.. ఆయ‌న అనుచ‌రులు ఇటీవ‌ల పెద్ద ఎత్తున క‌టౌట్లు పెట్టారు.

కానీ, స‌ద‌రు అభివృద్ధి మాత్రం భూత‌ద్ద ప‌ట్టుకుని వెతికినా.. క‌నిపించ‌క‌పోవ‌డంతో.. మాజీ ఎమ్మెల్యే అస‌లు ఎక్క‌డ అబివృద్ధి చేశారు? ఎలా చేశారు? ఎంత వ్య‌యం చేశారు? అనే విష‌యాల‌పై అధికారుల నుంచే స‌మాచారం సేక‌రించేందుకు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అధికారుల‌కు అప్ల‌యి చేశారు. దీనికి స‌హ‌జంగానే అధికారులు స‌మాధానం చెప్పా లి. కానీ.. వారు చెప్ప‌క‌పోగా.. దాదాపు నెల‌ల పాటు ఈ విష‌యాన్ని తొక్కి పెట్టారు. అంతేకాదు.. పోయి.. స్థానిక మండ‌ల కార్యాల‌యంలో అడ‌గాల‌ని పేర్కొన్నారు.

దీంతో అస‌లు విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే.. బుర్రా క‌నుస‌న్న‌ల్లోనే అధికారులు కూడా న‌డుచుకుంటున్నార‌ని.. ఆయ‌న నుంచి స‌మాచారం రావ‌డం వ‌ల్లే.. మాజీ ఎమ్మెల్యే ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే.. అటు సొంత పార్టీ నేత‌ల‌ను, ఇటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను కూడా త‌న గ్రిప్‌లో పెట్టుకుని బుర్రా బాగానే రాజ‌కీయం చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>