PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dig24d793e2-b98d-4cbd-b8ef-b798a8f8e960-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dig24d793e2-b98d-4cbd-b8ef-b798a8f8e960-415x250-IndiaHerald.jpgదేశ రాజ‌ధాని ఢిల్లీ, ఢిల్లీ స‌రిహ‌ద్దులో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మం రోజురోజుకు ఉధృత‌మ‌వుతోంది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల‌ను, హైవేల‌పై రోజుల త‌ర‌బ‌డి బైఠాయించి.. అక్క‌డే బ‌స చేస్తున్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేసేంత వ‌ర‌కు తాము ఇళ్ల‌కు వెళ్ల‌మ‌ని భీష్మించుకుని ఉద్య‌మం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో ప‌లు ద‌ఫాలుగా జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. కేంద్ర ప్ర‌భుత్వం చ‌ట్టdig;delhi;haryana - chandigarh;రాజీనామా;job;central government;punjabరైతుల ఉద్య‌మానికి పెరుగుతున్న‌ మ‌ద్ద‌తు... పంజాబ్ డీఐజీ రాజీనామా...!రైతుల ఉద్య‌మానికి పెరుగుతున్న‌ మ‌ద్ద‌తు... పంజాబ్ డీఐజీ రాజీనామా...!dig;delhi;haryana - chandigarh;రాజీనామా;job;central government;punjabMon, 14 Dec 2020 07:03:28 GMTదేశ రాజ‌ధాని ఢిల్లీ, ఢిల్లీ స‌రిహ‌ద్దులో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ రైతులు ఉద్య‌మం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మం రోజురోజుకు ఉధృత‌మ‌వుతోంది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల‌ను, హైవేల‌పై రోజుల త‌ర‌బ‌డి బైఠాయించి.. అక్క‌డే బ‌స చేస్తున్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేసేంత వ‌ర‌కు తాము ఇళ్ల‌కు వెళ్ల‌మ‌ని భీష్మించుకుని ఉద్య‌మం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో ప‌లు ద‌ఫాలుగా జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. కేంద్ర ప్ర‌భుత్వం చ‌ట్టాల్లో స‌వ‌ర‌ణ‌ల‌కు అంగీకారం తెలిపిన‌... రైతులు మాత్రం మొత్తం చ‌ట్టాల ర‌ద్దుకే ప‌ట్టుబ‌డుతున్నారు.


 రైతుల‌ను పూర్తిగా అన్యాయం చేసేలా, కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌ల‌కు అనుకూలంగా, బ‌డా కంపెనీల చేతుల్లోకి రైతుల బ్ర‌తుకుల‌ను తీసుకెళ్లేలా ఉన్నాయంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రైతులు చేస్తున్న ఉద్య‌మానికి దేశ వ్యాప్తంగా సానుకూలంగా స్పందన వ‌స్తోంది. కోట్లాది మంది ప్ర‌జ‌లు రైతుల‌కు మ‌ద్ద‌తు పలికారు. ఇప్ప‌టికే పంజాబ్‌ క్రీడాకారులు త‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసిన బ‌హుమ‌తుల‌ను, అవార్డుల‌ను వెన‌క్కి ఇస్తున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన డీఐజీ స్థాయిలో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తాను రైతులకు అండగా, వారికి మద్దతుగా నిలవనున్నట్లు ప్రకటించడం సంచలనం రేపుతోంది.


పంజాబ్‌ జైళ్ల శాఖ డీఐజీ అయిన లక్మీందర్ సింగ్ జఖర్ ఆదివారం రాజీనామా చేశారు. ఆ లేఖను హోం శాఖ కార్యదర్శికి పంపించారు. ఈ విషయాన్ని ఏడీజీపీ (జైలు) పీకే సిన్హా సైతం ధ్రువీకరించారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు పలు మార్గాల నుంచి మద్దతు లభించింది. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తన పద్మ అవార్డును తిరిగి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్ఏడీ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ దిండ్సా కూడా పద్మభూషణ్ వాప్ చేశారు. పంజాబ్ కవి సూర్జిత్ పతార్ కూడా పద్మశ్రీని వాపస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఎస్ఏడీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్త్తూ కూటమి నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.


హెరాల్డ్ స్మ‌రామీ : ర‌చ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ర‌గిల్చిన దిగంబ‌ర క‌వి జ్వాలాముఖి...

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>