PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-djp25b0955f-f8fd-432d-9655-6c74eee64406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-djp25b0955f-f8fd-432d-9655-6c74eee64406-415x250-IndiaHerald.jpgఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం ఏఎస్‌ఐ పార్థసారధిపై దాడి జరిగింది. అయితే మత్స్యపురి రోడ్డులో పొలం విషయంలో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు, వారిని కట్టడి చేసేందుకు వెళ్లారు. ఏఎస్‌ఐ పార్థసారధితో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తి కూడా గొడవ జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు.ap djp;gowtam;andhra pradesh;district;police;bhimavaramదారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!ap djp;gowtam;andhra pradesh;district;police;bhimavaramMon, 14 Dec 2020 08:15:00 GMTజిల్లా వీరవాసం ఏఎస్‌ఐ పార్థసారధిపై దాడి జరిగింది. అయితే మత్స్యపురి రోడ్డులో పొలం విషయంలో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు, వారిని కట్టడి చేసేందుకు వెళ్లారు. ఏఎస్‌ఐ పార్థసారధితో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తి కూడా గొడవ జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు. అయితే హఠాత్తుగా ఓ వ్యక్తి పోలీసులపై దాడి చేశాడు. కత్తితో దాడి చేయడంతో ఏఎస్‌ఐ పార్థసారధి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక హెడ్‌ కానిస్టేబుల్‌ మూర్తి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని భీమవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పార్థసారధికి చికిత్స పొందుతున్నారు.

ఇక వీరవాసం ఏఎస్‌ఐపై కత్తితో దాడి జరిగిన ఘటనను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. గాయపడిన ఏఎస్‌ఐ పార్థసారధికి అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్‌పికి ఆదేశించారు. అంతేకాదు ఈ ఘటనతో సంబంధం ఉన్న అందరినీ రౌండప్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక సంఘటనా స్థలానికి వెళ్లి, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీంతో అసలు పోలీసులపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది..? అక్కడున్నవారు ఎందుకు అడ్డుకోలేకపోయారు ? అని జిల్లా ఎస్‌పి ఆరా తీస్తున్నారు.

అయితే మరోవైపు ఏఎస్‌ఐపై దాడి ఘటన ఇటు పోలీస్‌ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక పోలీసులకే రక్షణ లేకుంటే ఎలా అని పోలీసులు, ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ మొదలైంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు, ఉన్నతాధికారులు సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపింది.


నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>