PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/cpi-cpm7cd28183-8300-44a6-9a07-8f514b4312b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/cpi-cpm7cd28183-8300-44a6-9a07-8f514b4312b8-415x250-IndiaHerald.jpgప్ర‌జ‌ల‌కు ఏదేనా చిన్న ఇబ్బంది వ‌చ్చినా దేశ‌వ్యాప్తంగా ముందు క‌దిలేది వామ‌ప‌క్షాలు. ఆ మాట‌కు వ‌స్తే రైత‌న్న‌ల‌కు ఇబ్బంది వ‌స్తే వాళ్లు అస్స‌లు రాజీప‌డ‌రు. అయితే కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టం విష‌యం అందిపుచ్చుకుని మోడీకి సెగ‌పుట్టించాల్సిన కామ్రెడ్లు నామ్ కేవాస్తే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనివెనుక కార్పొరేట్ శ‌క్తుల నుంచి క‌మ్యూనిస్టుల‌కు అందుతున్న విరాళేన‌ని తాజాగా ఓ జాతీయ మీడియా గుట్టు ర‌ట్టు చేసింది. అయితే ఒక్క కేంద్రంలోనే కాకుండా.. రాష్ట్రంలోనూ క‌మ్యూనిస్టు రాజ‌కీయాలు కార్పొరేట్ల త‌ర‌హాలcpi cpm;modi;kcr;mumbai;west bengal - kolkata;media;letter;central government;cpi;corporate;uriక‌మ్యూనిస్టుల `కార్పొరేట్` రాజ‌కీయం.. నారాయ‌ణ‌.. నారాయ‌ణ..‌!క‌మ్యూనిస్టుల `కార్పొరేట్` రాజ‌కీయం.. నారాయ‌ణ‌.. నారాయ‌ణ..‌!cpi cpm;modi;kcr;mumbai;west bengal - kolkata;media;letter;central government;cpi;corporate;uriMon, 14 Dec 2020 09:53:53 GMTకార్పొరేట్ల‌కు-క‌మ్యూనిస్టుల‌కు ప‌డ‌దు క‌దా.. మ‌రి ఈ గోలేంటి ? అంటున్నారా ? అక్క‌డే ఉంది.. అస‌లు సంగ‌తి..! ఇప్పుడు క‌మ్యూనిస్టులు కూడా ఫ‌క్తు.. భూర్జువా పార్టీల మాదిరి మారిపోతున్నాయ‌ని ఇటీవ‌ల ఓ కార్మిక సంఘం నాయ‌కుడు గొంతు చించుకున్నారు. అయితే దీనిని పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు గ‌మ‌నించిన త‌ర్వాత క‌మ్యూనిస్టులు కార్పొరేట్ రాజ‌కీయాల్లో ఆరితేరిపోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో రైతులు తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మిస్తున్నారు. మోడీ స‌ర్కారు తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో త‌మకు ఉరి త‌ప్ప మ‌రేమీ లేద‌ని పేర్కొంటూ వారు ఉద్య‌మిస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు ఏదేనా చిన్న ఇబ్బంది వ‌చ్చినా దేశ‌వ్యాప్తంగా ముందు క‌దిలేది వామ‌ప‌క్షాలు. ఆ మాట‌కు వ‌స్తే రైత‌న్న‌ల‌కు ఇబ్బంది వ‌స్తే వాళ్లు అస్స‌లు రాజీప‌డ‌రు. అయితే కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టం విష‌యం అందిపుచ్చుకుని మోడీకి సెగ‌పుట్టించాల్సిన కామ్రెడ్లు నామ్ కేవాస్తే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనివెనుక కార్పొరేట్ శ‌క్తుల నుంచి క‌మ్యూనిస్టుల‌కు అందుతున్న విరాళేన‌ని తాజాగా ఓ జాతీయ మీడియా గుట్టు ర‌ట్టు చేసింది. అయితే ఒక్క కేంద్రంలోనే కాకుండా.. రాష్ట్రంలోనూ క‌మ్యూనిస్టు రాజ‌కీయాలు కార్పొరేట్ల త‌ర‌హాలోనే న‌డుస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గతంలో ఆయా పార్టీలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు పెద్ద‌పీట వేసేవి. వాటిపై పోరాటాలు చేసేవి. అయితే.. గ‌డిచిన ఏడాదిన్న‌ర‌గా రాష్ట్రంలో పెద్ద‌గా ఈ ఊపు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా సంచ‌ల‌నాల‌కు వేదిగా క‌మ్యూనిస్టు పార్టీలు మారిపోతున్నాయి. ఈ త‌ర‌హా సంచ‌ల‌న రాజ‌కీయాలు చేయ‌డంలో భూర్జువా పార్టీల‌కు పెట్టింది పేరు. కానీ, ఇప్పుడు క‌మ్యూనిస్టులు కూడా విషయం లేక‌పోయినా.. వాద‌న‌కు దిగ‌డం, ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డం వంటివి చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మ‌హేశ్వ‌రిని మార్చేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని పెద్ద బాంబే పేల్చారు. నిజానికి ఇది ఔనా కాదా ? అనేది ఆయ‌న‌కు కూడా సందేహ‌మే.

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం సిఫార‌సుచేస్తే.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని మార్చేసేంత ప‌రిస్థితి ఉందా ? అనేది ప‌క్క‌న పెడితే.. క‌మ్యూనిస్టులు ఎప్పుడూ.. నిజాల‌ను నిర్ధార‌ణ చేసుకుని కానీ.. ఆయా విష‌యాల‌పై స్పందించ‌రు. కానీ, నారాయ‌ణ వ్య‌వ‌హారం మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ‌లో క‌మ్యూనిస్టులు ఇప్ప‌టికే అధికార పార్టీకి పూర్తిగా దాసోహ‌మైన ప‌రిస్థితి. తెలంగాణలో పూర్తిగా ఈ రెండుపార్టీలు కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయంటున్నారు. అక్క‌డ అన్ని విధాలా విరాళాలు బాగానే అందుతున్నాయ‌న్న టాక్ ప్ర‌జ‌ల్లోకి కూడా బ‌లంగా వ‌చ్చేసింది.

ఇక ఇప్పుడు ఏపీలోనూ అదే ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా దేశ‌వ్యాప్తంగా క‌మ్యూనిస్టులు రోజు రోజుకు కార్పొరేట్ శ‌క్తుల‌కు దాసోహ‌మ‌వుతోన్న ప‌రిస్థితి ఉంది. ఓవ‌రాల్‌గా ఒక‌ప్పుడు ప్ర‌జా రాజకీయం చేసే క‌మ్యూనిస్టులు నేడు కార్పొరేట‌ర్ రాజ‌కీయం చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఎంతో బ‌లంగా ఉన్న ప‌శ్చిమ బెంగాల్ లాంటి చోట్ల వాళ్లు శ‌ర‌వేగంగా ప‌త‌నం కావ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. 


ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>