PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-somu-veerraju-shift-tdp-vote-bank-to-bjp58ca7299-6024-4edd-aea9-08f2ed3298f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-somu-veerraju-shift-tdp-vote-bank-to-bjp58ca7299-6024-4edd-aea9-08f2ed3298f6-415x250-IndiaHerald.jpgగత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయమై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలు జరిగిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను ఈ మాట చెబుతున్నానని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెర తీసారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్నదేనని వ్యాఖ్యానించారుsomu veerraju;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;narendra modi;telugu;vishakapatnam;capital;court;prime minister;chief minister;central government;reddy;party;narendraఏపీ రాజధాని అమరావతేనని తేల్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు !ఏపీ రాజధాని అమరావతేనని తేల్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు !somu veerraju;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;narendra modi;telugu;vishakapatnam;capital;court;prime minister;chief minister;central government;reddy;party;narendraMon, 14 Dec 2020 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయమై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ విషయమై కోర్టులో పలు వ్యాజ్యాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను ఈ మాట చెబుతున్నానని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెర తీసారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్నదేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రం అమరావతిలోనే ఉంటాయని ఆయన వెల్లడించారు. అమరావతి ప్రాంతం తుళ్లూరులో భారతీయ కిసాన్‌ సంఘ్‌ సమావేశానికి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



‘‘మోదీ మనిషిగా చెబుతున్నా.. అమరావతే ఏపీ రాజధాని! మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి నిదర్శనమే ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం.. అమరావతిలోనే రాజధాని ఉండాలి.. రెండో అంశానికి తావులేదు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం’’ అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో బీజేపీ అద్భుత రాజధానిని నిర్మించి ఇస్తుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను ఈ హామీ ఇస్తున్నానని ఆయన చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రూ. 2 వేల కోట్లతో బీజేపీ అభివృద్ధి చేస్తుందన్నారు. అమరావతిలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరులో డిఫెన్స్‌ అకాడమీ నిర్మిస్తున్నామని వీర్రాజు వివరించారు.
 


 కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నా కూడా జగన్ సర్కారు మాత్రం విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాత్రం అమరావతిలోనే రాజధాని ఉంటుందని, ప్రధాని మోదీ ప్రతినిధిగా ఈ మాటలు చెబుతున్నానని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.


అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>