MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondae3668445-789d-48be-bfa6-694be1787653-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondae3668445-789d-48be-bfa6-694be1787653-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా తెరంగ్రేటం చేశాడు. తన నటనతో అభిమానుల గుండెల్లో రౌడీ హీరోగా మిగిలిపోయాడు. ఇక వరల్డ్ ఫేమస్‌ లవర్‌ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ సినిమాను చేస్తున్నారు.vijay devarakonda;puri jagannadh;surya sivakumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;tamil;marriage;king;industry;hero;king 1;joseph vijay;na peru surya;arjun 1;father;naa peru surya naa illu india;lie;fighter;devarakondaభయపడుతున్న రౌడీ హీరో అభిమానులు.. ఎందుకంటే..!?భయపడుతున్న రౌడీ హీరో అభిమానులు.. ఎందుకంటే..!?vijay devarakonda;puri jagannadh;surya sivakumar;vijay;vijay deverakonda;india;tollywood;cinema;tamil;marriage;king;industry;hero;king 1;joseph vijay;na peru surya;arjun 1;father;naa peru surya naa illu india;lie;fighter;devarakondaMon, 14 Dec 2020 09:00:00 GMTపెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా తెరంగ్రేటం చేశాడు. తన నటనతో అభిమానుల గుండెల్లో రౌడీ హీరోగా మిగిలిపోయాడు. ఇక వరల్డ్ ఫేమస్‌ లవర్‌ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఫైటర్ సినిమాను చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఆ షార్ట్‌ గ్యాప్‌ కాస్త లాంగ్‌ గ్యాప్ అయ్యింది. లాక్‌ డౌన్‌ ఎత్తేసినా ఫైటర్‌ మాత్రం ఇంకా సెట్‌కు రాలేదు. త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్‌ చేస్తారన్న టాక్ వినిపిస్తున్నా… ఎప్పుడన్నది పక్కాగా తెలియదు. ఈ టైంలోనే మరో అప్‌డేట్‌ రౌడీ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది.

ఇక తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు తండ్రిగా యాక్షన్‌ కింగ్ అర్జున్ నటిస్తున్నారన్నది కొత్త సమాచారం. అయితే ఈ వార్తతోనే రౌడీ ఫ్యాన్స్‌లో గుబులు మొదలైంది. మల్టీ లింగ్యువల్ హీరోగా అర్జున్‌కు మంచి క్రేజ్‌ ఉన్నా.. టాలీవుడ్ లో మాత్రం క్యారక్టర్‌ ఆర్టిస్ట్ గా ఆయన రికార్డ్ చాలా బ్యాడ్‌ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

అయితే అప్పుడెప్పడో రిలీజ్‌ అయిన శ్రీఆంజనేయం దగ్గర నుంచి అర్జున్‌ నటించిన తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. లై, నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలకు కూడా నెగెటివ్‌ రిజల్టే వచ్చింది. ఈ సెంటిమెంటే రౌడీ ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. అసలే హిట్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న విజయ్‌కి అర్జున్ సెంటిమెంట్‌ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని కలవర పడుతున్నారు ఫ్యాన్స్.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్లాప్స్ వచ్చినా.. ఇతర భాషల్లో మాత్రం అర్జున్‌ రికార్డ్‌ సూపర్ గా ఉంది. తమిళ, మలయాళ, కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న అర్జున్‌… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బ్లాక్‌ బస్టర్ హిట్స్ సాధిస్తున్నారు. ఫైటర్ కూడా పాన్ ఇండియా సినిమా కావటంతో అర్జున్‌ టాలీవుడ్‌ రికార్డ్‌ను పెద్దగా పట్టించుకోవటం లేదు మేకర్స్‌. మరి ఫైటర్‌ మీద అర్జున్‌ సెంటిమెంట్‌ ఎలా పనిచేస్తుందో చూడాలి మరి.


సోనూసూద్ విరాళాల‌కు అంతు లేదుగా... నిరుపేద‌ల‌కు ఈ- రిక్షాల పంపిణీ చేసిన రియ‌ల్ హీరో

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>