PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russiaba325dc6-9caf-4918-9389-fc9b9e18d1f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/russiaba325dc6-9caf-4918-9389-fc9b9e18d1f4-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికాపై సెబర్ నేరగాళ్లు పంజా విసిరారు. యూఎస్ ట్రెజరీ విభాగంలోని కంప్యూటర్ నెట్ వర్క్ ను రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిందనే విషయాన్ని యూఎస్ ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానా సమాచారం ఉన్న నెట్ వర్క్ పై సైబర్ ఆటాక్ జరిగిందని వెల్లడించింది. russia;auto;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;russia;american samoa;east;barack obama;letter;european union;custard apple;panjaaఅమెరికా ఖజానా డేటా హ్యాక్ ! రష్యా కుట్రపై అనుమానాలుఅమెరికా ఖజానా డేటా హ్యాక్ ! రష్యా కుట్రపై అనుమానాలుrussia;auto;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;russia;american samoa;east;barack obama;letter;european union;custard apple;panjaaMon, 14 Dec 2020 12:48:45 GMTఅగ్రరాజ్యం అమెరికాపై సెబర్ నేరగాళ్లు పంజా విసిరారు. యూఎస్ ట్రెజరీ విభాగంలోని కంప్యూటర్ నెట్ వర్క్ ను రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిందనే విషయాన్ని యూఎస్ ప్రభుత్వం అధికారికంగా  స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానా సమాచారం ఉన్న నెట్ వర్క్ పై సైబర్ ఆటాక్ జరిగిందని వెల్లడించింది.  ప్రభుత్వ నెట్ వర్క్ పైజరిగిన దాడి కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఈ విషయంలో టెక్నాలజీ నిపుణులు సహకరిస్తున్నారని అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ ప్రతినిధులు తెలిపారు.

          హ్యాకింగ్ కు గురైన విభాగాలను పరిశీలిస్తున్నామని , హ్యాకర్లు స్వాధీనం చేసుకున్న నెట్ వర్క్ ను తిరిగి సరిదిద్దేందుకు సీఐఎస్ఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని అమెరికా ఆర్థికశాఖ అధికారులు చెప్పారు.  అయితే  ఈ సైబర్ దాడి గత వారం జరిగిందని  'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది.  కస్టమర్ల కంప్యూటర్ సిస్టమ్స్ ను పరిశీలిస్తుండే టూల్స్ ను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. 

   మరోవైపు అమెరికా ఖజానా విభాగంపై పై జరిగిన  సైబర్ దాడి రష్యా ప్రభుత్వం అండతోనే జరిగిందని యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'ఫైర్ ఐ' వెల్లడించింది. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు చెందిన ఓ గ్రూప్ ఈ పని చేసుటుందని భావిస్తున్న ఎఫ్బీఐ, సైబర్ దాడిపై విచారణ ప్రారంభించింది.  ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇదే టీమ్ పలు ప్రభుత్వ ఏజన్సీల వెబ్ సైట్లపై దాడి చేసి, విలువైన సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు ఉన్నాయి.



పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>