MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines4cc78b2c-7587-41c3-931f-c6a80f441d65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines4cc78b2c-7587-41c3-931f-c6a80f441d65-415x250-IndiaHerald.jpgమన హీరోయిన్స్ లో చాలా మంది ప్రేమలో పడిన వారు ఉన్నారు. వీరిలో కొంత మంది నిశ్చితార్ధం వరకు వెళ్లారు. కొంత మంది పెళ్లి పీటలు కూడా ఎక్కేశారు. కానీ.., విచిత్రంగా బ్రేకప్ తరువాత ఈ ముద్దుగుమ్మల కెరీర్స్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాయి. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.tollywood heroines;amala akkineni;shruti haasan;trisha krishnan;amala paul anaka;jeevitha rajaseskhar;nayantara;rashmika mandanna;tollywood;cinema;telugu;marriage;hero;heroine;success;rakshit shettyబాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే కానీ సక్సెస్ దొరకని టాలీవుడ్ హీరోయిన్స్బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇస్తే కానీ సక్సెస్ దొరకని టాలీవుడ్ హీరోయిన్స్tollywood heroines;amala akkineni;shruti haasan;trisha krishnan;amala paul anaka;jeevitha rajaseskhar;nayantara;rashmika mandanna;tollywood;cinema;telugu;marriage;hero;heroine;success;rakshit shettyMon, 14 Dec 2020 10:00:00 GMTహీరోయిన్స్ కెరీర్స్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది. మన హీరోయిన్స్ లో చాలా మంది ప్రేమలో పడిన వారు ఉన్నారు. వీరిలో కొంత మంది నిశ్చితార్ధం వరకు వెళ్లారు. కొంత మంది  పెళ్లి పీటలు కూడా ఎక్కేశారు. కానీ.., విచిత్రంగా బ్రేకప్ తరువాత ఈ ముద్దుగుమ్మల కెరీర్స్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాయి. మరి ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

బ్రేకప్స్ గురించి చెప్పుకుంటే ముందుగా గుర్తుకి వచ్చే పేరు నయనతార. ఈ అమ్మడు రియల్ లైఫ్ లో ఇప్పటి వరకు రెండు సార్లు బ్రేకప్ చేసుకుంది. శింబు, ప్రభుదేవాతో విడిపోయినప్పుడు నయన్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా నయనతార టాప్ ప్లేస్ లోనే ఉంది. కానీ.., దర్శకుడు విగ్నేష్ శివన్ తో కూడా నయన్ కి విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఈ లిస్ట్ లో తప్పక చెప్పుకోవాల్సిన హీరోయిన్  రష్మిక మందన్న. ఈ అమ్మడు.. కన్నడలో కెరీర్ స్టార్ చేసింది. అక్కడ చేసిన ఒక్క సినిమా తరువాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరి నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. కానీ.., తరువాత కాలంలో ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక అక్కడ నుండి రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు.. ఈమె తెలుగులో టాప్ పొజిషన్ లో ఉంది.

ఇక సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ క్యాటగిరిలోకే వస్తుంది. ఈ అమ్మడికి సినిమా ఆఫర్స్ తగ్గినప్పుడు..  ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్ధం జరిగింది. తరువాత కాలంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కట్ చేస్తే.. తరువాత నుండి త్రిష మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇప్పటికీ త్రిషకి భారీగానే ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక హీరోయిన్ అమలాపాల్ కథ కాస్త విచిత్రం. దర్శకుడు ఏఎల్ విజయ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమలకు ఆఫర్స్ రాలేదు. కానీ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత అమల పాల్ ఇండస్ట్రీలో దూసుకుపోయింది.

ఇక కమల్ డాటర్ శృతిహాసన్ ది కూడా ఇదే స్టోరీ.  బాయ్ ఫ్రెండ్ మైఖెల్ కోర్సెల్‌తో బ్రేకప్ తర్వాత శృతికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. నిజానికి కాటంరాయుడు తరువాత ఈ అమ్మడిని అంతా మరచిపోయే పరిస్థితి వచ్చింది. సో శృతికి బ్రేకప్ మంచే చేసింది అనమాట.

ఇక హీరోయిన్ అంజలికి కూడా ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కాల్సిందే. ఆమె హీరో జై కి దూరం అయ్యాకనే టాప్ స్టార్ గా ఎదిగింది.

సో చూశారు కదా.. కొంత మందికి బ్రేకప్ కూడా ఇలా మంచి చేస్తోంది అనమాట.


ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>