PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd8597d311-db29-4c20-9b49-68e332bc929d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ttd8597d311-db29-4c20-9b49-68e332bc929d-415x250-IndiaHerald.jpgతిరుమలలో స్వామివారి ఉచిత ప్రసాదాలు కొంతమందికే దక్కుతున్నాయి. దీంతో మిగతా వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికే ఉచిత ప్రసాదాలు ఎందుకిస్తున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ తీరుకి నిరసనగా ఆలయం ముందు ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ttd;darshana;tiru;silver;tirumala tirupathi devasthanamప్రసాదం విషయంలో వివక్షా..? మండిపడ్డ భక్తులుప్రసాదం విషయంలో వివక్షా..? మండిపడ్డ భక్తులుttd;darshana;tiru;silver;tirumala tirupathi devasthanamMon, 14 Dec 2020 07:00:00 GMTటీటీడీ తీరుకి నిరసనగా ఆలయం ముందు ఆందోళన చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అసలేం జరిగింది? తిరుమలలో కొందరికే ప్రసాదం ఎందుకు?
తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు వెండి వాకిలి బయటకు వచ్చిన తర్వాత ఉచిత ప్రసాదాల వితరణ ఉంటుంది. వగపడి దగ్గర భక్తులందరికీ ఉచితంగా ప్రసాదం ఇస్తుంటారు టీటీడీ సిబ్బంది. ఇది సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. అయితే కొవిడ్‌ నిబంధనలతో ఈ ప్రక్రియను ఆపేశారు. భక్తులెవ్వరికీ ఉచిత ప్రసాదం ఇవ్వడంలేదు. స్వామివారికి సమర్పించే నైవేద్యాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో.. నైవేద్యం సమర్పించే సమయంలో దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులకు ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అయింది. కొంతమందికి మాత్రమే ప్రసాదం ఇచ్చి, మిగతా వారందర్నీ వట్టి చేతులతో పంపించడంతో గొడవ మొదలైంది. టీటీడీ అధికారుల నిర్ణయంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

ఉచిత ప్రసాదాన్ని అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం కొంతమంది భక్తులకు ప్రసాదాలు ఇచ్చి, మిగతావారికి ఇవ్వడంతో వారు ఆందోళనకు దిగారు. వగపడి ప్రాంతంలో నిరసనకు దిగారు. పోటు కార్మికులను లోపలకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. అధికారులు భక్తులకు నచ్చజెప్పి బయటకు పంపారు. ఉచిత ప్రసాదం విషయంలో ఇకపై అందరికీ ఇవ్వాలా లేక, అసలు ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు. మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు వృద్ధులు, చిన్నారులకు అవకాశం కల్పించడంతో తిరుమలలో భక్తుల సందడి పెరిగింది. నిబంధనలు సడలించిన తర్వాత శనివారం ఒక్కరోజే అత్యధికంగా 38,516 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 14,623 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలియజేసింది.ఉచిత ప్రసాదం విషయంలో భక్తుల ఆందోళనపై అధికారులు దృష్టిసారించారు. త్వరలో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.




హెరాల్డ్ స్మ‌రామీ : ర‌చ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ర‌గిల్చిన దిగంబ‌ర క‌వి జ్వాలాముఖి...

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>