PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid70659051-a8c5-46e9-b188-de0289150b12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid70659051-a8c5-46e9-b188-de0289150b12-415x250-IndiaHerald.jpgకరోనాతో అల్లాడిపోతున్న అమెరికాలో వ్యాక్సిన్‌ పంపిణి ప్రారంభమైంది. సోమవారం నుంచి అమెరికా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు అనుమతి లభించడంతో మిచిగన్‌లోని ఫైజర్ అతిపెద్ద ప్లాంట్ నుంచి వ్యాక్సిన్ల లోడ్లతో ఫెడెక్స్ ట్రక్కులు.covid;hyderabad;apple;india;canada;american samoa;letter;european union;custard appleఅమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ షురూ.అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ షురూ.covid;hyderabad;apple;india;canada;american samoa;letter;european union;custard appleMon, 14 Dec 2020 09:40:56 GMT కరోనాతో అల్లాడిపోతున్న అమెరికాలో వ్యాక్సిన్‌ పంపిణి ప్రారంభమైంది. సోమవారం నుంచి అమెరికా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు అనుమతి లభించడంతో మిచిగన్‌లోని ఫైజర్ అతిపెద్ద ప్లాంట్ నుంచి వ్యాక్సిన్ల లోడ్లతో ఫెడెక్స్ ట్రక్కులు.. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరాయి. మిచిగన్ ప్లాంట్ నుంచి 145 టీకా కేంద్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నారు.

 కొవిడ్ టీకా సరఫరా , పంపిణి కోసం అమెరికా సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ ను మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో టీకాలు సరఫరా చేస్తున్న బాక్సుల్లో ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాటిలో జీపీఎస్ పరికరాలను అమర్చారు.టీకా పంపిణి కేంద్రాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ కోసం జనాలు ఒక్కసారిగా ఎగబడకుండా ఉండేందుకు మార్గదర్శకాలు రూపొందించారు.అమెరికాలో తొలి విడతలో 30 లక్షల మందికి టీకాను పంపిణీ చేయనుండగా, తొలుత క్రిటికల్ కేర్ యూనిట్లలో పనిచేస్తున్న వైద్య  సిబ్బందికి, నర్సింగ్ హోంలలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇస్తారు. తొలి టీకా ఇచ్చిన మూడు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు.

అమెరికా దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్ కంపెనీ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను ఇప్పటికే కెనడా దేశంలో  పంపిణి చేస్తున్నారు. భారత్ లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఫైజర్ దరఖాస్తు చేసుకున్నా... భారత ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. మరోవైపు దేశ జనాభాలో 59 శాతం మందికి అవసరమైన కోవిడ్ వ్యాక్సిన్ కోసం భారత ప్రభుత్వం వివిధ ఫార్మా సంస్థలతో  ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ లో జరుగుతున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్ జరుగుతున్నాయి.


ఫైటర్" ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన పూరీ జగన్నాథ్

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>