PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan708b90ab-21c7-46c5-aefe-625edd278807-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan708b90ab-21c7-46c5-aefe-625edd278807-415x250-IndiaHerald.jpg2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయ చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాఫ్టర్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి అనjagan;auto;bharath;venu;taneti vanita;jagan;andhra pradesh;muralidhar rao;sri bharath;rajya sabha;mp;district;google;chief minister;minister;letter;tadepalli;reddy;party;shadow;mantra;venu thottempudiపోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్‌పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్‌jagan;auto;bharath;venu;taneti vanita;jagan;andhra pradesh;muralidhar rao;sri bharath;rajya sabha;mp;district;google;chief minister;minister;letter;tadepalli;reddy;party;shadow;mantra;venu thottempudiMon, 14 Dec 2020 12:53:35 GMTపోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్‌

2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయ చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాఫ్టర్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టు  నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం జగన్‌ పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్దకు చేరుకొని.. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్‌ పరిశీలించారు. 


పోలవరం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలనలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ష, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాలవాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు, జిల్లా ఎస్పి నారాయణ నాయక్‌లు పాల్గొననున్నారు.

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు  ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..‌ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11.50 నుంచి 1.15 వరకు పనుల పురోగతిపై సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 


పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>