MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu9279762f-8348-4da2-9bab-731afc86fa77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maheshbabu9279762f-8348-4da2-9bab-731afc86fa77-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెంటిమెంట్ ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారింది. అదేంటి? అని ఆశ్చర్యపోకండి. దీనికి వెనుక ఓ పెద్ద కథే ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా గురించే ఈ గందరగోళం. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో చేస్తాడో అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ‘సర్కారు వారి పాట’ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని, జనవరి 25 నుంచి షూటింగ్ మొదలవబోతున్నట్లు సమాచారం. maheshbabu;mahesh;shiva;koratala siva;tollywood;cinema;rajani kanth;january;blockbuster hit;lord siva;heroమహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?maheshbabu;mahesh;shiva;koratala siva;tollywood;cinema;rajani kanth;january;blockbuster hit;lord siva;heroMon, 14 Dec 2020 19:47:41 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెంటిమెంట్ ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారింది. అదేంటి? అని ఆశ్చర్యపోకండి. దీనికి వెనుక ఓ పెద్ద కథే ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా గురించే ఈ గందరగోళం. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో చేస్తాడో అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ‘సర్కారు వారి పాట’ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని, జనవరి 25 నుంచి షూటింగ్ మొదలవబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయాలని మహేష్ ఆలోచిస్తున్నారట. దీనికి ఓ కారణం కూడా ఉంది. మహేష్ బాబు - కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ ఆగస్టు 7నే విడుదల అయింది. ఈ చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ సెంటిమెంటును ఫాలో అవ్వాలని మహేష్ భావిస్తున్నారట. అందుకు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని కూడా ఆగస్టు 7నే విడుదల చేయాలని అంటున్నాడట. అయితే ఈ ఏడాది జనవరిలో మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల అయింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని తర్వాత మహేష్ చిత్రం ఏదీ రిలీజ్ అవ్వలేదు.

అందుకే అభిమానులు ‘సర్కారు వారి పాట’ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో మహేష్ సెంటిమెంటుతో ఆగస్టు 7న సినిమా రిలీజ్ అయితే.. ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చిన 20 నెలల వరకూ మరో మహేష్ చిత్రం లేనట్లే. ఇప్పుడు అభిమానులకు ఈ వార్త మింగుడు పడటం లేదు. 20 నెలల పాటు తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురు చూడాల్సి రావడం వారికి అసహనం కలిగిస్తోంది. మరి అభిమానుల కోసమైనా మహేష్ తన సెంటిమెంటును వదులు కుంటాడేమో చూడాలి.


ఊర మాస్ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న మహేష్. ..?

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..

భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లేనట్లేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>