Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp45bb34f9-6203-45ec-8edd-d69a423b1093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp45bb34f9-6203-45ec-8edd-d69a423b1093-415x250-IndiaHerald.jpg టీఆర్ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరే ప్రసక్తే లేదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్, పీఎం నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రులతో ...bjp;amit shah;kcr;amala akkineni;rahul new;rahul;vidya;delhi;hyderabad;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;india;rahul gandhi;andhra pradesh;telangana;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;industries;police;media;television;prime minister;electricity;minister;rahul sipligunj;vegetable market;central government;reddy;mantra;narendraటీఆర్‌ఎస్‌తో రాజీ ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిటీఆర్‌ఎస్‌తో రాజీ ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డిbjp;amit shah;kcr;amala akkineni;rahul new;rahul;vidya;delhi;hyderabad;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;india;rahul gandhi;andhra pradesh;telangana;narendra modi;mohandas karamchand gandhi;g kishan reddy;industries;police;media;television;prime minister;electricity;minister;rahul sipligunj;vegetable market;central government;reddy;mantra;narendraMon, 14 Dec 2020 14:39:27 GMTబీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్, పీఎం నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రులతో సమావేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదని, సర్కారీ బంద్ అని మండిపడ్డారు. భారత్ బంద్‌లో పాల్గొన్న కేసీఅర్, కవితలను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ చెప్పాలని నిలదీశారు. టీఆర్‌ఎస్ నిరసనలకు మాత్రమే అనుమతినిస్తూ, బీజేపీ చేసే నిరసనలకు అడ్డుకోవడం సమంజసం కాదని, తమకు కూడా పోలీసులు సహకరించాలని డిమాండ్ చేశారు.

భారత్ బంద్‌లో స్వయంగా మంత్రులు పాల్గొనటం సిగ్గుచేటని, రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోనలేక ఇలాంటి కుట్ర రాజకీయాలకు ప్రతిపక్షాలు పూనుకుంటున్నాయని, వ్యవసాయ చట్టాలను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. సీడ్ డెవలప్‌మెంట్ కోసం సీఎం నియోజకవర్గం గజ్వేల్‌లో ఐటీసీ కంపెనీని ఏర్పాటు చేశామని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం, మార్కెట్ యార్డులను ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఉందని చెప్పారు. అంతేకాకుండా వేర్ హౌసింగ్‌ల కోసం కూడా తెలంగాణకు నిధులు మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘ఆ విషయం సీఎం కేసీఆర్‌నే అడగండి’ అని బదులిచ్చారు.

రైతులకు నష్టం చేసే చర్యలకు బీజేపీ ఎన్నటికీ పాల్పడదని, రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు అడ్డుకున్నా తాము అనుకున్నది చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవటం బాధాకరంగా ఉందని, గత 70 ఏళ్ళుగా దేశంలో వ్యవసాయ రంగం దుర్భర పరిస్థితుల్లోనే ఉందని, రైతులు నానా అవస్థలు పడుతూనే ఉన్నారని, దానిని గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని కిషన్ రెడ్డి చెప్పారు. రైతు ఉద్యమం ప్రస్తుతం ఒకే రాష్ట్రానికి పరిమితమై ఉందని, దేశ వ్యాప్తంగా రైతులు ఈ చట్టాలను స్వాగతించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లోని రైతుల వద్దకు వెళ్ళి కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తామని, అందుకోసం కిసాన్ టీవీ ఛానల్ తీసుకొస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

యువత వ్యవసాయ రంగం వైపు వెళ్ళేలా చేయడం కూడా తమ ఆలోచన అని, రైతులకు విద్యుత్ కోతలు, ఎరువుల కొరత లేకుండా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కిసాన్ బ్రాండ్ పేరుతో రామగుండం పరిశ్రమ నుంచి తెలంగాణ, ఏపీ రైతులకు యూరియా అందించబోతున్నామని తెలిపారు. ఒన్ నేషన్..‌ ఒన్ గ్రిడ్‌తో రైతులకు 24గంటల విద్యుత్‌ను కేంద్రం అందజేస్తోందని, ఇది ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేమని కిషన్ రెడ్డి వెల్లడించారు.





కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...

కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>