PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-the-cm-who-visited-polavaram-did904e30c7-d8b8-449c-a25b-a780f1e329c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/if-the-cm-who-visited-polavaram-did904e30c7-d8b8-449c-a25b-a780f1e329c3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం వెళ్లారు. గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టుపై అనేక అంశాలు చర్చనీయాంశం కావడంతో.. ముఖ్యమంత్రి పర్యటనను ఆసక్తిగా తిలకించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి ముఖ్యమంత్రి ప if the cm who visited polavaram did;editor mohan;jagan;andhra pradesh;district;polavaram;buggana rajendranath reddy;chief minister;minister;polavaram project;central government;sv mohan reddy;reddy;mantraపోలవరంను సందర్శించిన సీఎం ఏం చేశారంటే..!పోలవరంను సందర్శించిన సీఎం ఏం చేశారంటే..!if the cm who visited polavaram did;editor mohan;jagan;andhra pradesh;district;polavaram;buggana rajendranath reddy;chief minister;minister;polavaram project;central government;sv mohan reddy;reddy;mantraMon, 14 Dec 2020 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం వెళ్లారు. గత కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్టుపై అనేక అంశాలు చర్చనీయాంశం కావడంతో.. ముఖ్యమంత్రి పర్యటనను ఆసక్తిగా తిలకించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిసారి ముఖ్యమంత్రి ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటనను జిల్లా అధికారులు విజయవంతం చేశారు. పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం స్పిల్ వేలో రెండు లక్షల 17వేల  క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి చేశారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్ భీంలకు గాను 30 నిర్మాణాలను పూర్తి చేశారు. కరోనా కాలంలోనూ లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనితో పాటు స్పిల్ ఛానల్ పనులు, అదేవిధంగా 10 లక్షల  క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేశారు.

కేంద్రం నుంచి నిధుల విషయంలో పడిన మెలికపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌తో మంత్రులు బుగ్గన, అనిల్‌ కుమార్‌ భేటీ కాగా.. కేంద్రం సానుకూలంగా స్పందించటం ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించింది.

కేంద్ర మంత్రి షెకావత్ కూడా 15 రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తానని చెప్పటం.... ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనతో పనులు ఊపందుకుంటాయనే ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.  రైతుల సంక్షేమంగా ధ్యేయంగా సాగుతున్నారు.








మూడేళ్ల తర్వాత సినిమా.. కసిని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం..!

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>