PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/easy-non-agricultural-land-registration4c1f0839-451a-4ec7-97b4-1b6fad0d3dda-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/easy-non-agricultural-land-registration4c1f0839-451a-4ec7-97b4-1b6fad0d3dda-415x250-IndiaHerald.jpgఅవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరగాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా.. ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలన్నారు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. easy non agricultural land registration;kcr;dharani;telangana;court;cabinet;minister;applicationసులువుగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్..!సులువుగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్..!easy non agricultural land registration;kcr;dharani;telangana;court;cabinet;minister;applicationMon, 14 Dec 2020 17:00:00 GMTమంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూములను రైతులు  సులభంగా  రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు  సీఎం. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా సులభంగా జరిగే విధానమే రావాలన్నారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నాన్‌-అగ్రికల్చర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ కావడం లేదు. చాలాకాలం తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో స్లాట్ల బుకింగ్‌ పెరిగింది. ఆస్తుల క్రయవిక్రయదారులు స్లాట్ల కోసం పోటీపడుతుండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయబోమని స్పష్టం చేసింది ప్రభుత్వం . ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల్లోనే ఎక్కువ దరఖాస్తులున్నాయి. ఈ స్కీమ్‌ ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. కోర్టులో కేసు ఉండడంతో రెగ్యులరైజేషన్‌ ఇప్పట్లో సాధ్యం కాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై అందుబాటులో పెట్టిన కాల్‌సెంటర్‌ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చూద్దాం.. ఏ మాత్రం సవ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందో.




పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!

ఇవి తింటే కరోనా వైరస్ రాదట...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>