MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 క్రేజీ షో రోజు రోజుకు మంచి పాపులారిటీ అలానే రేటింగ్స్ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ తాజా 14వ వారం హౌస్ నుండి మోనాల్ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా మొత్తంగా అభిజీత్, అఖిల్, సోహెల్, అరియనా, హారిక లు టాప్ 5 కంటెస్టెంట్స్ గా హౌస్ లో మిగిలారు. కాగా వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో పక్కాగా తెలియాలి అంటే మరొక వారం రోజులు ఓపిక పట్టాలి. ఇకపోతే మరొకవైపు ఈ సీజన్ లో మొదటి వారం నుండి కూడా ప్రస్తుత 14వ వారం వరకు మొత్తంగా 11 వారాలు ఎలిమిabhijeet;bigg boss 4 telugu;akhil akkineni;geum;bigboss;media;army;winner;hero;winner1;star maa;houseపాపం ... అభిజీత్ పై అంత కుట్ర జరుగుతోందా ....??పాపం ... అభిజీత్ పై అంత కుట్ర జరుగుతోందా ....??abhijeet;bigg boss 4 telugu;akhil akkineni;geum;bigboss;media;army;winner;hero;winner1;star maa;houseMon, 14 Dec 2020 04:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 క్రేజీ షో రోజు రోజుకు మంచి పాపులారిటీ అలానే రేటింగ్స్ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ తాజా 14వ వారం హౌస్ నుండి మోనాల్ ఎలిమినేట్ అయి వెళ్లిపోగా మొత్తంగా అభిజీత్, అఖిల్, సోహెల్, అరియనా, హారిక లు టాప్ 5 కంటెస్టెంట్స్ గా హౌస్ లో మిగిలారు. కాగా వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో పక్కాగా తెలియాలి అంటే మరొక వారం రోజులు ఓపిక పట్టాలి. ఇకపోతే మరొకవైపు ఈ సీజన్ లో మొదటి వారం నుండి కూడా ప్రస్తుత 14వ వారం వరకు మొత్తంగా 11 వారాలు ఎలిమినేషన్ జోన్ లో నిలిచినప్పటికీ కూడా అభిజీత్ మంచి వోటింగ్స్ దక్కించుకుని ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ వస్తున్నాడు.

మరొకవైపు ఎంతో టాలెంటెడ్ గా మైండ్ గేమ్ ఆడుతున్న అభిజీత్ కి ప్రతి వారం కూడా భారీ గా ఓట్లు పోలవుతున్నాయని, అలానే బయట ఆయనకు ఎందరో అభిమానులు, అలానే ఆర్మీ ల సభ్యులు భారీగా మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే అభిజీత్ ఫీజికల్ టాస్కుల్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేడు అనే ఒక విమర్శ మాత్రం ఉంది. ఇక ఇటీవల హౌస్ నుండి బయటకు వెళ్లిన ఒక కంటెస్టెంట్ ఇప్పటికీ పలు సందర్భాల్లో అభిజీత్ బిగ్ బాస్ హౌస్ కి కరెక్ట్ కాదు అనేటివంటి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

మరోవైపు కొందరు ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు కూడా అభిజీత్ టాస్క్ ల్లో ఆడకుండా ఊరికే టైటిల్ ఎగరేసుకుపోవాలని చూస్తున్నాడు అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తుండడంతో కొందరు ఆయన ఫ్యాన్స్ అటువంటి వారికి గట్టిగా రిటార్ట్ అయితే ఇస్తున్నారు. మొత్తంగా హౌస్ లో తనదైన ఆటతీరుతో దూసుకుపోతూ రోజు రోజుకు మంచి వోటింగ్స్, ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్న తమ హీరో అభిజీత్ పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అవి పనిచేయవని, అలానే ఆయన ఫైనల్ విన్నర్ గా నిలవడం తథ్యం అని పలువురు ఆయన ఫ్యాన్స్ అంటున్నారు... !!


హెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసా

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>