PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dsc58b60765-eb1c-4c27-8aa1-1ce2e8397cf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dsc58b60765-eb1c-4c27-8aa1-1ce2e8397cf5-415x250-IndiaHerald.jpgనిరుద్యోగుల‌కు తెలంగాణ సర్కార్ శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచ‌ర్లు, పోలీసు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేష‌న్ ఇస్తామని ప్రకటించింది.ఉపాధ్యాయ, పోలీసు పోస్టుల‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. dsc;kcr;apple;telangana;chief minister;letter;thota chandrasekhar;qualification;central government;european union;custard appleటెట్ లేకుండా డీఎస్సీ ఎలా? కేసీఆర్ ప్రకటనపై గందరగోళంటెట్ లేకుండా డీఎస్సీ ఎలా? కేసీఆర్ ప్రకటనపై గందరగోళంdsc;kcr;apple;telangana;chief minister;letter;thota chandrasekhar;qualification;central government;european union;custard appleMon, 14 Dec 2020 09:33:09 GMTనిరుద్యోగుల‌కు తెలంగాణ సర్కార్ శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచ‌ర్లు, పోలీసు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేష‌న్ ఇస్తామని ప్రకటించింది.ఉపాధ్యాయ, పోలీసు పోస్టుల‌తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. తెలంగాణలో వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు భావిస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాల సేకరణ అనంతరం నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై గందరగోళం నెలకొంది. ముఖ్యంగా జేఎల్, డీఎల్, డీఎస్సీ పోస్టులను ఎలా నియామిస్తారన్న ప్రశ్న విద్యావేత్తల నుంచి వస్తోంది. రాష్ట్రంలో జోన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జోన్లను పునర్ వ్యవస్థికరిస్తూ కేసీఆర్ తీసుకున్న విధాన పరమైన నిర్ణయానికి ఇంకా కేంద్రం ఆమోదం రాలేదు. దీంతో జోన్ల ఇష్యూ పరిష్కరించకుండా జేఎల్,డీఎల్ ఉద్యోగాల భర్తీ అసాధ్యమంటున్నారు నిపుణులు. ఇక డీఎస్పీపై పెద్ద గందరగోళమే ఉంది. టెట్ ఎగ్జామ్ నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయలేరు. తెలంగాణలో 2012లో చివరి సారిగా టెట్ నిర్వహించారు. ఎనిమిది ఏండ్లుగా టెట్ నిర్వహించకుండా డీఎస్సీ ఎలా నిర్వహిస్తున్నారనే ప్రశ్న నిరుద్యోగుల నుంచి వస్తోంది.
       

  ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) స్కోర్‌ కాలపరిమితి ఇప్పటివరకు ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. ఈ లెక్కన తెలంగాణలో గతంలో టెట్ పాసైన అభ్యర్థుల కాల పరిమితి ముగిసిపోయింది. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా ఇటీవలే నిర్ణయించింది. అయితే ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకే ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీ ప్రకటించింది. కాని దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. అది వస్తే గాని తెలంగాణలో డీఎస్సీ నిర్వహించడం కుదరదు. ఇన్ని అంశాలు ఉన్నా కేసీఆర్ మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లంటూ నిరుద్యోగులకు మోసం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను.. మోసం చేసే కుట్రలో భాగంగానే తాజా ప్రకటన వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి.


దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>