MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram77776c21-7326-4c3c-891d-efa21a5902ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram77776c21-7326-4c3c-891d-efa21a5902ba-415x250-IndiaHerald.jpgపౌరాణికం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి రామాయణం, మహా భారతం. ఇక తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చేశారు. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో బాల‌కృష్ణ మాత్ర‌మే పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించారు. క్ర‌మంగా.. పౌరాణిక చిత్రాలు తెర‌కెక్కించ‌డం త‌గ్గిపోయాయి.trivikram;ntr;ramu;india;korcha;tollywood;cinema;telugu;malayalam;2020;nandamuri taraka rama rao;mahaపౌరాణిక చిత్రానికి స్టోరీ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌..!పౌరాణిక చిత్రానికి స్టోరీ రెడీ చేస్తున్న త్రివిక్ర‌మ్‌..!trivikram;ntr;ramu;india;korcha;tollywood;cinema;telugu;malayalam;2020;nandamuri taraka rama rao;mahaMon, 14 Dec 2020 11:00:00 GMTమహా భారతం. ఇక తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చేశారు. నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో బాల‌కృష్ణ మాత్ర‌మే పౌరాణిక పాత్ర‌ల్లో న‌టించారు. క్ర‌మంగా.. పౌరాణిక చిత్రాలు తెర‌కెక్కించ‌డం త‌గ్గిపోయాయి. ఓ ద‌శ‌లో పౌరాణిక చిత్రాల గురించి ఆలోచించ‌డ‌మే మానేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ట్రెండ్ మారుతోంది. మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌ళ్లీ పౌరాణిక చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే మ‌ల‌యాళంలో మ‌హాభార‌తాన్ని ఇరండామూలం అనే పేరు తెర‌కెక్కిస్తార‌ని అనౌన్స్ చేశారు. త‌ర్వాత విక్ర‌మ్ క‌ర్ణ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అర‌వింద్ మ‌రికొంత నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణాన్ని త్రీడీ టెక్నాల‌జీతో రూపొందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక మ‌హాభార‌తాన్ని తెర‌కెక్కించ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌ని రాజ‌మౌళి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక అల్లు అర‌వింద్ మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి రామాయ‌ణంను త్రీడీ టెక్నాల‌జీతో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు గ‌త ఏడాదిన ప్ర‌క‌టించారు. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితిశ్ తివారి, మామ్ ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్యావ‌ర్ కాంబినేష‌న్‌లో ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తామ‌ని తెలిపారు. 2020 ప్ర‌థ‌మార్థంలో ప్రారంభించి 2021లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని అప్ప‌ట్లో నిర్మాత‌లు తెలిపారు. అయితే కొన్ని రోజులు త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

తాజాగా టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారని సమాచారం. రామాయ‌ణం మొత్తాన్ని మూడు గంట‌ల్లో కుదించి త్రివిక్ర‌మ్ మాట‌లు రాస్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన త‌ర్వాతే మిగిలిన భాష‌ల‌కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జరుగుతుంద‌ని అంటున్నారు. తార‌క్ సినిమా స్టార్ట్ అయ్యే వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఈ స్క్రిప్ట్ వ‌ర్క్ మీద‌నే కూర్చుంటాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే రామాయ‌ణంను ఆదిపురుష్ పేరుతో ఓంరావుత్ తెర‌కెక్కిస్తుండ‌గా, ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రి అర‌వింద్ నిర్మించ‌బోయే ఈ త్రీడీ రామాయ‌ణంలో రాముడిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిని క‌లిగించే అంశ‌మే మరి.


కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>