PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona2f33a63b-259d-48b1-81f7-38ba70200f56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona2f33a63b-259d-48b1-81f7-38ba70200f56-415x250-IndiaHerald.jpgకరోనా బీభత్సం ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అంతా చూశారు. పెద్ద ఎత్తున కేసులు వచ్చి పడ్డాయి. అలాగే మరణాలూ సంభవించాయి. ఆ తరువాత కరోనా నెమ్మదించింది. జనం బేఖాతర్ గా తిరిగేస్తున్నారు. కానీ వైరస్ స్వభావం తెలిసిన వారంతా సెకండ్ థర్డ్ వేవ్స్ రావడం ఖాయమని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. carona;amala akkineni;delhi;brazil;russia;italy;spain;andhra pradesh;american samoa;cinema;january;december;september;cinema theatre;june;marchకరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ లాక్ డౌన్ ఆంక్షలు...?కరోనా సెకండ్ వేవ్ తో మళ్ళీ లాక్ డౌన్ ఆంక్షలు...?carona;amala akkineni;delhi;brazil;russia;italy;spain;andhra pradesh;american samoa;cinema;january;december;september;cinema theatre;june;marchMon, 14 Dec 2020 19:00:00 GMTజూన్ నుంచి సెప్టెంబర్ వరకూ అంతా చూశారు. పెద్ద ఎత్తున కేసులు వచ్చి పడ్డాయి. అలాగే మరణాలూ సంభవించాయి. ఆ తరువాత కరోనా నెమ్మదించింది. జనం బేఖాతర్ గా తిరిగేస్తున్నారు. కానీ వైరస్ స్వభావం తెలిసిన వారంతా సెకండ్ థర్డ్ వేవ్స్  రావడం ఖాయమని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.

సరిగ్గా శతాబ్దం క్రితం 1918 నుంచి 1920 మధ్యలో రెండేళ్ళ పాటు స్పైనిష్ ఫ్లూ అంటూ ఒక  భయంకరమైన వైరస్ ప్రపంచమంతా మానవాళిని పట్టి పీడించింది. దాని ప్రభావం కూడా రెండేళ్ల పాటు కొనసాగింది. అది కూడా మధ్యలో తగ్గి మళ్లీ పెరిగి ఇలా ఒక ఆట ఆడేసుకుంది. ఇలాగే మరి కొన్ని వైరస్ లు కూడా తగ్గుతూ హెచ్చుతూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇపుడు చూస్తే కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచంలోని అమెరికా, రష్యా, ఇటలీ, బ్రెజిల్, స్పెయిన్  వంటి దేశాలు గడగడలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ని సరిగ్గా అంచనా వేయడంతో విఫలమైన దేశాలు అందుకు తగిన మూల్యాన్ని కూడా చెల్లిస్తున్నాయి. ఇపుడు దేశంలో చూస్తే ఢిల్లీ, కేరళలలో సెకండ్ వేవ్ మొదలైంది. అక్కడ కరోనా తగ్గి మళ్ళీ ఊపందుకోవడానికి మధ్య గల సమయాన్ని లెక్కించిన వైద్య నిపుణులు ఏపీలో సెకండ్ వేవ్ కి పూర్తిగా ఆస్కారం ఉందని అంటున్నారు.


అది కూడా జనవరి 15 నుంచి మార్చి 15 మధ్యన తన విశ్వరూపం చూపిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండడంతో ముందస్తు చర్యలకు దిగుతోంది అంటున్నారు. ఏపీలో ఈ నెల 26 నుంచి మళ్లీ లాక్  డౌన్ నిబంధలను కఠినంగా అమలు చేయడానికి కూడా ప్రభుత్వం రెడీ అవుతోంది అంటున్నారు. మాల్స్, రెస్టారెంట్లు, హొటల్స్, సినిమా హాల్స్, పబ్లిక్ ప్లేసేస్ వంటి వాటి మీద కచ్చితమైన ఆంక్షలు ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు, బహిరంగ సమావేశాలకు కూడా కచ్చితమైన నిబంధనలు పెడతారు.

ఇక అదే విధంగా కంటోంట్మెంట్ జోన్లను కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్నది కూడా సమీక్షలు నిర్వహించి మరీ నిర్ణయం తీసుకుంటారట. ఇక ఈ నెల 26 నుంచి కరోనా ఆంక్షలు మొదలుకావడానికి కారణాలు ఉన్నాయి. ఈ నెల 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి రంగం సిద్ధమవుతోంది. దాంతో డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో కర్ఫ్యూను విధించాలని కూడా ఆలోచిస్తున్నారుట. మొత్తానికి చూసుకుంటే వైద్య సేవలను రెట్టింపు చేయడంతో పాటు అవసరమైన బెడ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం కూడా చేస్తారట. ఇవన్నీ చూసినపుడు కరోనా లాక్ డౌన్ కి మళ్ళీ ఏపీ రెడీ అవుతోందని అంటున్నారు.




ఊర మాస్ హిట్ మూవీకి సీక్వెల్ చేస్తున్న మహేష్. ..?

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>