MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjuna676c2ed-30a6-4bd6-8499-7fb4847a13ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/allu-arjuna676c2ed-30a6-4bd6-8499-7fb4847a13ab-415x250-IndiaHerald.jpg ఉదయ్‌పూర్‌లోని హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన నిహారిక, చైతన్య పెళ్లిలో పాల్గొనడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, విమాన ప్రయాణ సమయంలో అల్లు అర్జున్ కనబరిచిన క్రమశిక్షణ ఎయిర్‌పోర్టు అధికారులను ఆశ్చర్యపరిచింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రయాణంలోనూ మాస్క్ ధరించి మరికొందరికి స్ఫూర్తిగా నిలిచిన అల్లు అర్జున్‌కు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. allu arjun;pawan;allu arjun;kalyan;kirti;naga chaitanya;niharika konidela;pawan kalyan;rakshita;uday kiran;varsha;cinema;media;twitter;wife;allu sneha;arjun 1;chaitanya 1ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ అధికారుల మన్ననలను పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ అధికారుల మన్ననలను పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్allu arjun;pawan;allu arjun;kalyan;kirti;naga chaitanya;niharika konidela;pawan kalyan;rakshita;uday kiran;varsha;cinema;media;twitter;wife;allu sneha;arjun 1;chaitanya 1Mon, 14 Dec 2020 17:10:00 GMTస్టైలిష్ స్టార్ గా కీర్తింపబడుతున్న అల్లు అర్జున్ కి యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత యువతలో అంత ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి అల్లు అర్జునే అనటంలో సందేహం లేదు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టీ నిహారిక, చైతన్యల వివాహ వేడుకలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లిన బన్నీ.. అక్కడి ఎయిర్‌పోర్టు అధికారుల మన్ననలను పొందారు.
 


వివరాల్లోకి వెళితే... ఉదయ్‌పూర్‌లోని హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన నిహారిక, చైతన్య పెళ్లిలో పాల్గొనడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, విమాన ప్రయాణ సమయంలో అల్లు అర్జున్ కనబరిచిన క్రమశిక్షణ ఎయిర్‌పోర్టు అధికారులను ఆశ్చర్యపరిచింది. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ప్రయాణంలోనూ మాస్క్ ధరించి మరికొందరికి స్ఫూర్తిగా నిలిచిన అల్లు అర్జున్‌కు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు అధికారిణితో కలిసి బన్నీ తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలని మేం కోరుకుంటాం. అలాగే, వారు కూడా నిబంధనలను పాటించడం ద్వారా మేం సుక్షితంగా ఉండటానికి సహాయపడతారు. మరిచిపోకుండా మాస్క్‌లు ధరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు’’ అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లో సైతం అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురవడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎయిర్‌పోర్టు అధికారులు మాత్రమే కాదు.. బన్నీ ఫ్యామిలీ స్టే చేసిన స్టార్ హోటల్ సిబ్బంది కూడా ఆయన్ని సర్‌ప్రైజ్ చేశారు. అల్లు అర్జున్ హిట్ సినిమా టైటిల్స్‌‌తో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్స్‌ని గదిలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే.


" style="height: 805px;">




గుంటూరు జిల్లా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది

పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>