PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2adbbf-406f-41a0-8491-00256bec2584-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2adbbf-406f-41a0-8491-00256bec2584-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకాలు ఉంటాయని అంటారు. కానీ కొందరు ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టగలరు. తెలంగాణా రాజకీయాల్లో చూసుకుంటే చాణక్య వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేసే నైపుణ్యం కేసీయార్ సొంతం. కేసీయార్ రాజకీయం ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు, అలాగే ఆయనను అనుసరించడం కూడా ఎవరికీ అంత ఈజీ కాదు. kcr;view;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;korcha;chanakya-movie-2019;congress;chanakya;prime minister;success;central government;nijam;sara shrawan;party;mantra;narendraసరైన టైంలో కేసీయార్ సక్సెస్ ఫుల్ ప్లాన్ ?సరైన టైంలో కేసీయార్ సక్సెస్ ఫుల్ ప్లాన్ ?kcr;view;amit shah;kcr;delhi;hyderabad;bharatiya janata party;korcha;chanakya-movie-2019;congress;chanakya;prime minister;success;central government;nijam;sara shrawan;party;mantra;narendraMon, 14 Dec 2020 10:30:00 GMTచాణక్య వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేసే నైపుణ్యం కేసీయార్ సొంతం. కేసీయార్ రాజకీయం  ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు, అలాగే ఆయనను అనుసరించడం కూడా ఎవరికీ అంత ఈజీ కాదు.

కేసీయార్ పడిపోయాడు అన్నపుడల్లా ఆయన పడి లేచిన తరంగంలా లేచి కూర్చుని సింహగర్జనే చేశారు. ఉద్యమ కాలంలో ఇదే జరిగింది. కేసీయార్ ఉప ఎన్నికల్లో చాలా సార్లు గెలిచారు. కొన్నిసార్లు ఓడారు కూడా. అపుడు తెలంగాణా లేదు, కేసీయార్ లేడు అని కూడా అనేశారు. కానీ కేసీయార్ మాత్రం అలాంటి వాటికి ధీటైన సమాధానం చెప్పడం ద్వారా తాను పడి లేచే కడలి తరంగాన్ని అని నిరూపించుకున్నారు.

ఇదిలా ఉంటే దాదాపు ఏడేళ్ల కేసీయార్ ముఖ్యమంత్రిత్వం మీద తెలంగాణా సమాజానికి కొంత వ్యతిరేకత ఉండవచ్చు. అది సహజం కూడా. కానీ అధికారం దిగిపోయేటంత వ్యతిరేకత అయితే లేదు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ లో అధిక సీట్లు సాధించిన తరువాత బీజేపీ తెలంగాణాలో తెగ హడావుడి చేస్తోంది.

బీజేపీ ఇక అధికారం మాదే అని కూడా గట్టిగా దబాయిస్తోంది. అంతే కేసీయార్ లోకి చాణక్యుడు వెంటనే కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. ఆయన హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులతో సహా ప్రముఖులను కలిశారు. అమిత్ షాతో భేటీ వేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఆ చర్చ సారాంశం ఏమో కానీ ఇక్కడ కాంగ్రెస్ వామపక్షాలు మాత్రం కేసీయార్ బీజేపీతో జట్టు కట్టేశారు అని ప్రచారం అయితే గట్టిగా చేయడం మొదలెట్టాయి.

అది చాలు కేసీయార్ కి. బీజేపీ సాధించిన ఇటీవల విజయాలు మొత్తం పాలపొంగులా తేలిపోవడానికి ఈ ప్రచారం చాలా ఉపయోగపడుతుంది. బీజేపీతో కేసీయారే కరచాలనం చేశాక ఇక ఆ పార్టీ వైపు జనాలు ఎందుకు చూస్తారు. ఇది కదా పొలిటికల్ థియరీ. ఇది కదా అసలైన స్ట్రాటజీ.  నిజంగా కేసీయార్ బీజేపీతో  కలుస్తారా చేస్తారా అన్నది రెండవ మాట కానీ కేసీయార్ కోరుకున్న ప్రచారం మాత్రం ఇపుడు తెలంగాణాలో జరిగిపోతోంది. అది బీజేపీ ఎగుగుదల మీద గట్టి దెబ్బ తీయబోతోంది.





కరోనా నాలో నిరాశ మిగిల్చింది.. విజయ్ దేవరకొండ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?

దారుణం : రూ.లు 500 కోసం స్నేహితున్నే చంపేశాడు.?

దేశవ్యాప్తంగా మొదలైన రైతుల ఒక్కరోజు నిరాహార దీక్ష... ఢిల్లీ సీఎంకూడా దీక్షలోనే!

దారుణం: గొడవను ఆపేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి..!

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>