EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawan-bjp-somuveerraju-tirupati-loksabha2401fac3-43e4-493e-a911-8211394c5c74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawan-bjp-somuveerraju-tirupati-loksabha2401fac3-43e4-493e-a911-8211394c5c74-415x250-IndiaHerald.jpgనిజానికి కార్యవర్గ సమావేశంలో కూడా నడ్డా ప్రకటనకు అనుగుణంగానే చర్చ జరిగింది. తొందరలోనే రెండుపార్టీల నేతలతో హైపవర్ కమిటి వేయబోతున్నట్లు, ఆ కమిటి నిర్ణయం ప్రకారమే అభ్యర్ధి పోటీ చేస్తారని మాట్లాడుకున్నారు. అయితే కార్యవర్గ సమావేశంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగానే వీర్రాజు ప్రకటన విషయం తెలిసి నేతలు కూడా ఆశ్చర్యపోయారట. అయితే ప్రకటించింది స్వయంగా అధ్యక్షుడే కావటంతో తర్వాత ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లడలేదట. మొత్తానికి ముందునుండి అనుకుంటున్నట్లుగానే పవన్ను రెండోసారి కూడా బీజేపీ బకరాను చేసేసింది అని అర్ధమైపోతోందిjanasena pawan bjp somuveerraju tirupati loksabha;pawan;ganga;pawan kalyan;tiru;bharatiya janata party;ganges;janasena;tirupati;lotus;husband;janasena party;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : మొత్తానికి పవన్ తో బీజేపీ భలే ఆడుకుంటోందే ?హెరాల్డ్ ఎడిటోరియల్ : మొత్తానికి పవన్ తో బీజేపీ భలే ఆడుకుంటోందే ?janasena pawan bjp somuveerraju tirupati loksabha;pawan;ganga;pawan kalyan;tiru;bharatiya janata party;ganges;janasena;tirupati;lotus;husband;janasena party;partyMon, 14 Dec 2020 03:00:00 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ మళ్ళ బకారాను చేసేసింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీచేస్తారనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒకవైపు బీజేపీ పెద్దలు చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా తిరుపతిలో శనివారం మొదలైన రెండు రోజుల కమలంపార్టీ సమావేశాల్లో అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ బీజేపీ నే పోటీ చేస్తుందని చెప్పేశారు. శనివారం జరిగిన శోభాయాత్రలో వీర్రాజు మాట్లాడుతు జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్ధికే ఓట్లు వేయాలంటూ జనాలను అభ్యర్ధించటం సంచలనంగా మారింది.  జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా ఏమో మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనల్లో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే విషయమై కమిటి వేస్తామని చెప్పారు. ఈ విషయం చెప్పి ఇఫ్పటికి పదిహేనురోజులు అయిపోయింది. ఇంకా కమిటిని వేయనేలేదు కానీ బీజేపీ అభ్యర్ధే ఉపఎన్నికలో పోటీ చేస్తారని వీర్రాజు ఎలా ప్రకటించారు ? అన్నదే ఇపుడు ప్రశ్నగా మారింది.




నిజానికి కార్యవర్గ సమావేశంలో కూడా నడ్డా ప్రకటనకు అనుగుణంగానే చర్చ జరిగింది. తొందరలోనే రెండుపార్టీల నేతలతో హైపవర్ కమిటి వేయబోతున్నట్లు, ఆ కమిటి నిర్ణయం ప్రకారమే అభ్యర్ధి పోటీ చేస్తారని మాట్లాడుకున్నారు. అయితే కార్యవర్గ సమావేశంలో ఒకవైపు చర్చలు జరుగుతుండగానే వీర్రాజు ప్రకటన విషయం తెలిసి నేతలు కూడా ఆశ్చర్యపోయారట. అయితే ప్రకటించింది స్వయంగా అధ్యక్షుడే కావటంతో తర్వాత ఈ విషయంలో ఎవరు ఏమీ మాట్లడలేదట. మొత్తానికి ముందునుండి అనుకుంటున్నట్లుగానే పవన్ను రెండోసారి కూడా బీజేపీ బకరాను చేసేసింది అని అర్ధమైపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా అడ్డుకుంది. బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారని చెప్పి తర్వాత ప్రచారానికి కూడా దూరంగా ఉంచేసింది.




ఇపుడు తాజాగా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తోంది. ఒకవైపు చర్చలంటునే మరోవైపు కమిటీలంటునే చివరకు బీజేపీనే పోటీ చేస్తుందని బహిరంగంగా ప్రకటించటాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి పార్టీ బలాన్ని తీసుకుంటే రెండుపార్టీలు ఒకటే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో రెండింటిలో ఏపార్టీకి కూడా బలం లేదు. మొన్నటి లోక్ సభ ఎన్నికలో బీజేపీ అభ్యర్ధికి వచ్చింది కేవలం 16 వేల ఓట్లు మాత్రమే. జనసేన బలపరచిన బీఎస్పీ అభ్యర్ధికి వచ్చింది 20 వేల ఓట్లు. ఇద్దరు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లకన్నా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కు వచ్చిన ఓట్లు 25 వేలంటే వీటి పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనకు లేనిబలాన్ని బీజేపీ చాలా ఎక్కువగా ఊహించేసుకుంటోంది. చూద్దాం ఎన్నికల్లో వీళ్ళ బలం ఏమిటో తేలిపోతుంది కదా.




నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>