PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/browsersb471938b-b2e0-45c7-ac4d-5532eaa9f2aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/browsersb471938b-b2e0-45c7-ac4d-5532eaa9f2aa-415x250-IndiaHerald.jpgగూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాండెక్స్.. ఇవే ప్రస్తుతం మనం ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్లు. అయితే వీటన్నింట్లో మాల్ వేర్ దాడి జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ 365 బృందం వెల్లడించింది. ఈ మాల్ వేర్.. బ్రౌజర్లలో అనవసరమైన యాడ్లు ఇంజెక్ట్ చేయడం, అలాగే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు యాడ్ చేయడం వంటి పనులు చేసేస్తోందట. అలాగే కొన్ని బ్రౌజర్లలో డీఎల్ఎల్ ఫైల్స్‌ను కూడా దానికి అనుగుణంగా మార్చుకుంటోందట. browsers;microsoft;google;audioబుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!browsers;microsoft;google;audioMon, 14 Dec 2020 20:22:19 GMTగూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాండెక్స్.. ఇవే ప్రస్తుతం మనం ఉపయోగించే ఇంటర్నెట్ బ్రౌజర్లు. అయితే వీటన్నింట్లో మాల్ వేర్ దాడి జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ 365 బృందం వెల్లడించింది. ఈ మాల్ వేర్.. బ్రౌజర్లలో అనవసరమైన యాడ్లు ఇంజెక్ట్ చేయడం, అలాగే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు యాడ్ చేయడం వంటి పనులు చేసేస్తోందట. అలాగే కొన్ని బ్రౌజర్లలో డీఎల్ఎల్ ఫైల్స్‌ను కూడా దానికి అనుగుణంగా మార్చుకుంటోందట.

కొన్ని సందర్భాల్లో వెబ్ సైట్ క్రిడెన్షియల్స్‌ను కూడా ఈ మాల్ వేర్ మార్చేస్తోంది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ అధికారులు హెచ్చరించారు. మే నెల నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఈ మాల్ వేర్ చాలా వేగంగా వ్యాపించిందట. దీన్ని ప్రస్తుతానికి ‘ఆడ్రోజెక్’ అని పరిశోధకులు పిలుస్తున్నారు. మొత్తం మీద 159 డొమైన్లలో ఈ మాల్ వేర్ చొచ్చుకు పోయినట్లు తెలుస్తోంది. ఈ డొమైన్లలో ఉనన 17,300 యూఆర్ఎల్స్‌పై ఆడ్రోజెక్ ప్రభావం పడింది. వీటన్నింటిలో కలిపి 15,300 మాల్ వేర్ శాంపిల్స్ దొరికాయట.

ఇంత భారీ సంఖ్యలో మాల్ వేర్ శాంపిల్స్ దొరకడం ఆందోళన కరం అని పరిశోధకులు చెప్తున్నారు. యూజర్లను కొన్ని అఫిలియేటెడ్ పేజిలకు తీసుకెళ్లడం, అనవసరమైన యాడ్స్‌ను సెర్చింజర్ రిజల్ట్స్‌లో యాడ్ చేయడం.. ఆడ్రోజెక్ విధుల్లో ముఖ్యమైన భాగమని సమాచారం. దీనికోసం బ్రౌజర్ల సెక్యూరిటీ కంట్రోల్స్‌ను ఆఫ్ చేయడం కూడా ఈ మాల్ వేర్ పనే. కానీ ఇలా చేయడం వల్ల యూజర్ల వ్యక్తిగత వివరాల గోప్యతకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మనం ఆడ్రోజెక్ ప్రభావిత వెబ్ సైట్ ఓపెన్ చేయగానే మనకు తెలీకుండానే ఓ ర్యాండమ్ ఫైల్‌.. టెంపరరీ ఫోల్డర్‌లో డౌన్ లోడ్ అయిపోతుందట. ఇది దానికై అదే రన్ అయిపోయి క్విక్ ఆడియో, కన్వర్టర్, ఆడియో లావా.. వంటి పేర్లతో మన డివైజ్ మెయిన్ ఫోల్డర్‌లో చేరిపోతుంది. దీని ద్వారా మన డేటా మొత్తం ఈ మాల్ వేర్ యాక్సెస్ చేయగలుగుతుంది.


ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ రూ. 72 వేలు బాకీ

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!

కరోనా దెబ్బ: ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య

ఆ ఊళ్లో ఏ ఇంటికి వెళ్లినా.. అమ్మాయిల పేర్లే..

భారత్ లో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లేనట్లేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>