PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddy7e658de1-7fa1-40c6-abbe-a5247ac4163c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddy7e658de1-7fa1-40c6-abbe-a5247ac4163c-415x250-IndiaHerald.jpgఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు వ్యవసాయ బిల్లుల నెపంతో రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఆదాయం పెంచేందుకే కొత్త చట్టాలు చేశామన్న కిషన్ రెడ్డి.kishanreddy;auto;modi;kcr;ktr;amala akkineni;delhi;apple;india;telangana;g kishan reddy;east;police;prime minister;minister;arrest;letter;central government;european union;neem;custard apple;reddy;raccha;narendraరైతుల ఉద్యమం వెనక రాజకీయ కుట్ర- కిషన్ రెడ్డిరైతుల ఉద్యమం వెనక రాజకీయ కుట్ర- కిషన్ రెడ్డిkishanreddy;auto;modi;kcr;ktr;amala akkineni;delhi;apple;india;telangana;g kishan reddy;east;police;prime minister;minister;arrest;letter;central government;european union;neem;custard apple;reddy;raccha;narendraMon, 14 Dec 2020 17:23:43 GMTఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు వ్యవసాయ బిల్లుల నెపంతో రచ్చ చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. రైతులకు ఆదాయం పెంచేందుకే కొత్త చట్టాలు చేశామన్న కిషన్ రెడ్డి..  ప్రధాని మోడీ కలలో కూడా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోరన్నారు. కొందరు కావాలనే రెచ్చగొడుతూ రైతుల ఉద్యమాన్ని తమకు రాజకీయంగా వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు సంక్షేమం కోసం కేంద్రం గత ఆరేండ్లుగా  ఎన్నో చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కరెంటు, ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. పంట దిగుబడి పెరిగేలా యూరియాకు వేపపూత వేయించామని తెలిపారు. . 

తెలంగాణలో ఆరున్నర వేల కోట్లతో ఫెర్టిలైజర్ పరిశ్రమల్ని పునరుద్ధరించామని చెప్పారు కిషన్ రెడ్డి. పంటల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీపై కోపంతోనే భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతిచ్చారన్నారు. కేటీఆర్, కవితలను ఎందుకు ముందస్తు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.దేశ వ్యాప్తంగా రైతులను కలిసి కొత్త చట్టాల గురించి వివరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. రైతుల ఆందోళన  పంజాబ్‌కే పరిమితమైనా .. తాము దేశ వ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పారు.

 మరోవైపు ఢిల్లీ సరిహద్దులో అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. 19 రోజులైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు నిరనసకారులు. ఉద్యమం విరమించి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆహ్వానించినా రైతు సంఘాలు తిరస్కరించాయి. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నామని ప్రకటించిన తర్వాతే చర్చలకు వస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. దీంతో రైతుల ఆందోళన ఎప్పటివరకు కొలిక్కి వస్తోందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.



ఆలు అరవింద్ చేసిన ఈ పని వల్ల చిరంజీవి ఎంత లాస్ అయ్యారో తెలిస్తే కోపం వస్తుంది

పీసీసీ కోసం ఢిల్లీకి వెళ్లనున్న ఆ ఇద్దరు నేతలు?

అమ్మ: గర్భస్రావాలకు కారణాలు ఇవే..!?

వకీల్ సాబ్ అప్పుడు వస్తే... వేరే సినిమాల రిలీజ్ సంగతి ఎలా..?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కిషన్ రెడ్డి... ఎందుకు వెళ్ళారో...!

తిరుపతిలో ఎవరి బలం ఎంత.. ఎవరు గెలిచేలా ఉన్నారు..?

భార్యను డైరెక్ట్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>