EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-no-tribal-leader-got-elected-from-tdp97036358-f559-4b4d-bef2-3834b7043551-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-no-tribal-leader-got-elected-from-tdp97036358-f559-4b4d-bef2-3834b7043551-415x250-IndiaHerald.jpgఅయితే ఇక్కడే చంద్రబాబు ఉపన్యాసాల మీద ఓ అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే గిరిజనుల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిందంతా నిజమే అయితే టీడీపీ తరపున ఒక్క ఎంఎల్ఏ కూడా ఎందుకు గెలవలేదు ? మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎస్టీ అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు ? తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా టీడీపీ గెలవలేదు. అసెంబ్లీల్లోనే ఎక్కడా గెలవలేదు కాబట్టే రెండు ఎంపి సీట్లలో కూడా ఓడిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలే కాదు 2014 naidu tdp tribal mlas jagan ycp amaravati vizag;amala akkineni;girija;telugu desam party;godavari river;mp;east;telugu;scheduled tribes;east godavari;vishakapatnam;police;assembly;mla;tdp;ycp;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసాహెరాల్డ్ ఎడిటోరియల్ : గిరిజనులు టీడీపీని ఎందుకు దూరంపెట్టారో తెలుసాnaidu tdp tribal mlas jagan ycp amaravati vizag;amala akkineni;girija;telugu desam party;godavari river;mp;east;telugu;scheduled tribes;east godavari;vishakapatnam;police;assembly;mla;tdp;ycp;partyMon, 14 Dec 2020 05:00:00 GMT‘గిరిజనులకు తెలుగుదేశంపార్టీ చాలా చేసింది...టీడీపీ హయాంలోనే గిరిజనులు అభివృద్ధి చెందారు’ ఇది తాజాగా విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు పరిధిలోని నేతలతో చంద్రబాబు చెప్పిన మాటలు. జూమ్ యాప్ లో చంద్రబాబు మాట్లాడుతు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను మోసం చేస్తోందంటు మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను అక్రమంగా తవ్వుకుపోతున్నారంటూ వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు. తన హయాంలో గిరిజనులకు ఏమేమి పథకాలు అమలు చేసింది, ఎంతెంత నిధులు ఖర్చు చేసిందనే విషయంపై పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. చంద్రబాబు చెప్పింది తప్పయినా ఒప్పయినా చేసేదేమీ లేదు కాబట్టి నేతలు కూడా చెవులప్పగించేశారు. మొత్తం గంటసేపు చంద్రబాబు చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాన్ని భరించక నేతలకు తప్పటం లేదులేండి.




అయితే ఇక్కడే చంద్రబాబు ఉపన్యాసాల మీద ఓ అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే గిరిజనుల సంక్షేమం కోసం చంద్రబాబు చేసిందంతా నిజమే అయితే టీడీపీ తరపున ఒక్క ఎంఎల్ఏ కూడా ఎందుకు గెలవలేదు ? మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎస్టీ అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు ? తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా టీడీపీ గెలవలేదు. అసెంబ్లీల్లోనే ఎక్కడా గెలవలేదు కాబట్టే రెండు ఎంపి సీట్లలో కూడా ఓడిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలే కాదు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్కసీటులో కూడా టీడీపీ గెలవలేదు.




వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ఎస్టీ నేత కూడా గెలవలేదంటేనే గిరిజునులు ఏకమొత్తంగా టీడీపీని ఎంతదూరంగా పెట్టారో అర్ధమైపోతోంది. ఇందుకు కారణం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు గిరిజన ప్రాంతాల్లో చేసిన విధ్వంసమే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విశాఖ, విజయనగరం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ పేరుతో టీడీపీ నేతలు అక్రమంగా కోట్లరూపాయలు దోచేసుకున్నారు. అడ్డొచ్చిన వారిని పోలీసులతో నిర్భందించారు. దౌర్జన్యాలు, దాడులకు లెక్కేలేదు. గిరిజనుల భూములన్నింటినీ ఆక్రమించేసుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తరపున గిరిజనులకు ఇంత చేశామని చంద్రబాబు చెప్పిందంతా కాగితాలకు మాత్రమే పరిమితమైంది. క్షేత్రస్ధాయిలో జరిగింది చాలా తక్కువ. కాబట్టి సొల్లు కబుర్లు ఆపేసి జరిగిన తప్పులను నిజాయితీగా విశ్లేషించుకుంటే పార్టకి మంచిది లేకపోతే ఇలా జూమ్ యాప్ లో కబుర్లు చెప్పుకుంటు కూర్చోవాల్సిందే.




నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>