Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-kalyan-sends-birthday-wishes-to-victory-venkateshef018cde-4432-45ca-b409-a1897cace6f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pawan-kalyan-sends-birthday-wishes-to-victory-venkateshef018cde-4432-45ca-b409-a1897cace6f0-415x250-IndiaHerald.jpg ప్రముఖ హీరో, రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేశ్‌ పుట్టిన రోజు ఆదివారం. ఈ నేపథ్యంలో పలువురు సీని ప్రముఖులు, రాజకీయ నేతలు వెంకటేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెంకటేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా... pawan kalyan;pawan;venkatesh;dharma;kalyan;pawan kalyan;janasena;cinema;hero;posters;allu sneha;janasena party;gopala gopala;party;f3;narappa;chitramవిక్టరీ వెంకటేశ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్విక్టరీ వెంకటేశ్‌కు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్pawan kalyan;pawan;venkatesh;dharma;kalyan;pawan kalyan;janasena;cinema;hero;posters;allu sneha;janasena party;gopala gopala;party;f3;narappa;chitramSun, 13 Dec 2020 14:59:00 GMTఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హీరో, రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేశ్‌ పుట్టిన రోజు ఆదివారం. ఈ నేపథ్యంలో పలువురు సీని ప్రముఖులు, రాజకీయ నేతలు వెంకటేశ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెంకటేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా, తన పార్టీ జనసేన తరపున వెంకటేశ్‌కు బర్త్ డే విషెస్ అందజేశారు. ఈ మేరకు జనసేన తనపున అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

 "మంచి మనసున్న సన్మిత్రులకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌గారితో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకుణ్ణి కాక ముందు నుంచి ఆయనతో నాకు స్నేహం ఉంది. తరచూ వెంకటేష్‌గారితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఆయన మంచి చదువరి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు.

అందులో ఉన్న విషయాలు వివరిస్తూ, ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని ధృడపరచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతో పాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దం పట్టింది. కొత్త తరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే వెంకటేష్‌గారు మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అని తెలిపారు పవన్‌కళ్యాణ్‌.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటిగ్ త్వరలో పూర్తి కానుంది. అనంతరం మరికొన్ని ప్రాజెక్టులనూ లైన్‌లో పెట్టారు. ఇక వెంకటేశ్ ప్రస్తుతం నారప్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను కూడా ఈ రోజే(ఆదివారం) విడుదల చేశారు. దీని తర్వాత ఎఫ్3 సినిమాలో చేయనున్నారు. ఈ చిత్రం పోస్టర్ కూడా ఈరోజే విడుదల చేశారు.


బాలయ్యను కాదని సూర్యతో సినిమా ?

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>