PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alcohol6abe8810-5ed8-4249-bdff-cb70e6eec21f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alcohol6abe8810-5ed8-4249-bdff-cb70e6eec21f-415x250-IndiaHerald.jpgమద్యం వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెం. 1 స్థానంలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇద్దరు మగవారిలో ఒకరు మద్యానికి బానిసలయ్యారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది.alcohol;cbn;soundarya;telangana;district;panchayati;survey;husband;mancherialఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానాఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానాalcohol;cbn;soundarya;telangana;district;panchayati;survey;husband;mancherialSun, 13 Dec 2020 14:17:18 GMTభర్త, పిల్లలు మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని చింతగూడెం, వెంకటాపూర్‌, లక్ష్మీపూర్‌, లక్ష్మీపూర్‌కొలాంగూడలలో మద్యం నిషేధించాలని మహిళలు తీర్మానించారు. మద్యం నిషేధించాలని శనివారం మహిళలంతా ఇక్కడ అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించి మద్యం కొనుగోళ్లను కళ్లెం వేయాలని అనుకున్నారు. మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా రూ.50 వేల జరిమానా విధిస్తామని సమావేశం అనంతరం అందరూ తీర్మానించారు.

గిరిజన గూడెంలలో  విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయని వెంకటాపూర్‌ సర్పంచ్‌ ఆడె సౌందర్య ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ పంచాయతీలలో అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో యథేచ్చగా మద్యాన్ని అమ్మేస్తున్నారు. ఆఖరికి ప్రతి కిరాణా దుకాణంలోనూ మద్యం అమ్ముతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం కారణంగా యువకులు దానికి బానిసలుగా మారిపోయి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా నష్టపోతున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఈ కారణంగానే గిరిజన గూడెంలలో మద్యం అమ్మవద్దని తీర్మానం చేసినట్లుగా వారంతా చెప్పారు. కాగా.. మద్యం వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెం. 1 స్థానంలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబుల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తెలుస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇద్దరు మగవారిలో ఒకరు మద్యానికి బానిసలయ్యారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 27,351 గృహాలలో 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులపై సర్వే నిర్వహించగా.. గ్రామీణ ప్రాంతాల్లో 49 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్టు తేలింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యపానానికి అలవాటు పడినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మందు కొడుతున్నట్టు ఈ సర్వేలో తెలిసింది.


‘ఫైటర్’ కు తోడుగా యాక్షన్ కింగ్ కూడానా?

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>