MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-sukumar-is-following-him930fac05-fc59-4089-9708-917e4c47942c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-sukumar-is-following-him930fac05-fc59-4089-9708-917e4c47942c-415x250-IndiaHerald.jpgకరోనా ఒక వైపు భయపెడుతున్నా... ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ 50 రోజులు దాటిపోయింది. మరోవైపు బాలయ్య నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే ఓ స్టార్‌ హీరో సినిమాకు కరోనా బ్రేకులేసింది. ఇందులో నటిస్తున్న వాళ్లెవ్వరూ కరోనా బారిన పడలేదు. మరి దర్శకుడు లొకేషన్‌ ఎందుకు ఛేంజ్‌ చేసేశాడు. director sukumar is following him;balakrishna;kumaar;meenakshi;gunasekhar;sukumar;hyderabad;godavari river;district;east;cinema;east godavari;hero;rajahmundryసుకుమార్ ఆయన్ను ఫాలో అవుతున్నాడు..!సుకుమార్ ఆయన్ను ఫాలో అవుతున్నాడు..!director sukumar is following him;balakrishna;kumaar;meenakshi;gunasekhar;sukumar;hyderabad;godavari river;district;east;cinema;east godavari;hero;rajahmundrySun, 13 Dec 2020 22:00:00 GMTబాలయ్య నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే ఓ స్టార్‌ హీరో సినిమాకు కరోనా బ్రేకులేసింది. ఇందులో నటిస్తున్న వాళ్లెవ్వరూ కరోనా బారిన పడలేదు. మరి దర్శకుడు లొకేషన్‌ ఎందుకు ఛేంజ్‌ చేసేశాడు.

పుష్ప షూటింగ్‌ ఆ మధ్య  తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో 20రోజుల పాటు జరిగింది. చిత్ర యూనిట్‌లో చాలామందికి కరోనా సోకడంతో.. షూటింగ్‌ను అర్ధంతరంగా ఆపేశారట. మరోసారి అక్కడకు వెళ్లకుండా.. .. ఆ అడవిని సెట్‌గా మార్చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్‌.

ఒక్కడు సినిమాలో చారిత్రాత్మక కట్టడం చార్మినార్‌ది కీ రోల్‌ కావడంతో... అక్కడ షూటింగ్‌ అంటే రిస్క్‌ కాబట్టి సెట్‌గా వేయించాడు దర్శకుడు గుణశేఖర్. అర్జున్‌ మూవీ కోసం మీనాక్షి దేవాలయంను పునఃప్రతిష్టించాడు. లెక్కల మాష్టారు సుకుమార్‌ కూడా గుణశేఖర్‌ దారిలోనే వెళ్తున్నాడు.

సగంలో ఆగిపోయిన మారేడుపల్లి ఫారెస్ట్‌ షెడ్యూల్‌ మళ్లీ మొదలవుతుంది. అయితే.. చిత్ర యూనిట్‌ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లకుండా.. హైదరాబాద్‌లోనే తీస్తారట. ఫారెస్ట్‌ సెట్‌ను హైదరాబాద్‌లో వేయిస్తున్నారని.. మారేడుపల్లి వెళ్లకుండా ఇక్కడే తీస్తారని తెలిసింది. రంగస్థలం విషయంలోనే సుకుమార్‌ ఇదే రూల్‌ ఫాలో అయ్యాడు. రాజమండ్రి దగ్గర పల్లెటూరులో కొంతభాగం షూట్‌ చేసుకొచ్చి.. మిగతాదంతా హైదరాబాద్‌లో వేసిన విలేజ్‌ సెట్‌లో ఫినిష్‌ చేశాడు. సెట్‌ విషయంలో సుకుమార్‌ మరోసారి ఇదే లెక్క ఫాలో అవుతున్నాడు.

మొత్తానికి గుణశేఖర్ దారిలో సుకుమార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కల మాస్టారు సెట్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మారేడు మిల్లి అడవుల్లో 20రోజుల పాటు షూటింగ్ కు ప్లాన్ చేయగా.. చిత్ర యూనిట్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇలా కాదని భావించిన సుకుమార్ హైదరాబాద్ లో ఫారెస్ట్ సెట్ వేయించేస్తున్నాడు. అయితే ఇప్పటికే రంగస్థలం విలేజ్ సెట్ లో షూటింగ్ విజయవంతంగా జరుపుకొని.. రియాలిటీని తలపించింది.

   









డైపర్స్ ధరిస్తేనే ప్లైట్ లోకి ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>