Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/man-pushed-her-girlfiend-in-freezing-cold-outside-and-kills-his-girl-friendb8db27c3-9c96-46eb-9960-26f90276ff2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/man-pushed-her-girlfiend-in-freezing-cold-outside-and-kills-his-girl-friendb8db27c3-9c96-46eb-9960-26f90276ff2e-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే ప్రాణాలమీదకు తీసుకొస్తాయి. ప్రాణాలు పోయిన తరువాత ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి సంఘటనే రష్యాలో జరిగింది. ఓ చిన్న పందెం కోసం తన ప్రేయసిని గడ్డకట్టే చలిలోకి నెట్టి చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె అప్పటికే ...russia;korcha;moscow;96;vచిన్న పందెం కోసం గర్భంతో ఉన్న ప్రేయసిని గడ్డకట్టే చలిలో తోసి..చిన్న పందెం కోసం గర్భంతో ఉన్న ప్రేయసిని గడ్డకట్టే చలిలో తోసి..russia;korcha;moscow;96;vSun, 13 Dec 2020 12:28:00 GMTమాస్కో: కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే ప్రాణాలమీదకు తీసుకొస్తాయి. ప్రాణాలు పోయిన తరువాత ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదు. ఇలాంటి సంఘటనే రష్యాలో జరిగింది. ఓ చిన్న పందెం కోసం తన ప్రేయసిని గడ్డకట్టే చలిలోకి నెట్టి చంపేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె అప్పటికే నిండు గర్భవతి. చలిని తట్టుకోలేక ఆమె ఆర్తనాదాలు చేస్తుంటే ఇతడు మాత్రం హాయిగా గదిలో కూర్చుని వింత చూడసాగాడు. అయితే ఆ చలిలో ఎక్కవ సేపు ఉండలేక ఆమె సృహతప్పిపోయింది. ప్రేయసి అరుపులు వినపడకపోవడంతో వెంటనే తలుపు తీసిన అతడు షాకయ్యాడు. ఎందుకంటే అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే లోనికి తీసుకొచ్చినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.

వాలంటీనా గ్రిగర్‌యేవా అనే యువతి స్టాస్‌ రీఫ్లే అనే 28 ఏళ్ల ప్రియుడితో కలిసి నివశిస్తోంది. అయితే ఉన్నట్లుండి ఓ రోజు అతడు ఆమెను బికినీ వేసుకోవాలని కోరాడు. ‘అసలే చలికాలం. అందులోనూ గర్భంతో ఉన్నాను. ఈ టైంలో బికినీ ఏంట’ని ఆమె అడిగినా.. జస్ట్ చూడాలని ఉందని కోరాడు. అయితే ప్రియుడి ముచ్చట తీర్చేందుకు ఆమె బికినీ ధరించి వచ్చింది. అప్పటికే ఓ దుర్మార్గపు ఆలోచనతో ఉన్న అతడు ఆమె బికినీ వేసుకుని రాగానే వెంటనే ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు.

ఊహించని ఈ పరిణామంతో ఆమె షాక్‌కు గురయ్యింది. అయితే బయట మొత్తం గడ్డకట్టించే చలి కావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తనను లోపలికి రానివ్వాలని వేడుకుంది. కానీ స్టాస్ వినిపించుకోలేదు. దీనికి కారణం అతడు అంతకుముందే మరో వ్యక్తితో ఈ విషయంలో 1300 డాలర్లు(రూ.96 వేలు)కు పందెం కాశాడు. దీంతో ఆ పందెంలో గెలవాలనే కోరికతో ఆమె బాధను పట్టించుకోలేదు. 15 నిముషాల పాటు వాలంటీనా చలిలోనే ఉండిపోయింది. ఆ చలికి తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి చేరింది. కొద్ది సేపటికి ఆమె గొంతు వినిపించకపోవడంతో తలుపు తీసిన ప్రియుడు కిందపడిపోయిన ఆమెను గదిలోకి తీసుకొచ్చాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. ఆమె చనిపోయింది.


బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>