PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest-to-reach-tara-leveld13f8a36-6e4c-4514-923f-cc85d4e0ed8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest-to-reach-tara-leveld13f8a36-6e4c-4514-923f-cc85d4e0ed8c-415x250-IndiaHerald.jpgనూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వమిస్తున్న హామీలతో సంతృప్తి చెందని రైతులు పూర్తి స్థాయి కార్యచరణకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్భంధించి నిరసన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు చర్చలకు రమ్మంటూనే కేంద్ర ప్రభుత్వం క్యాంపయినింగ్ కు ప్రణాళికలు వేస్తోంది. ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. farmers protest to reach tara level;view;delhi;narendra singh tomar;haryana - chandigarh;narendra singh tomar.;rajasthan;minister;central government;jaipur;mantra;narendraతారా స్థాయికి చేరిన రైతుల నిరసన !తారా స్థాయికి చేరిన రైతుల నిరసన !farmers protest to reach tara level;view;delhi;narendra singh tomar;haryana - chandigarh;narendra singh tomar.;rajasthan;minister;central government;jaipur;mantra;narendraSun, 13 Dec 2020 21:30:00 GMTకేంద్ర ప్రభుత్వం క్యాంపయినింగ్ కు ప్రణాళికలు వేస్తోంది. ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  17రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. రేపు సింఘ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేయనున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 19లోపు తమ డిమాండ్ లు అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతుందని కొత్త చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. రైతు సంఘాలను విడదీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

ఆందోళనలో భాగంగా నేడు రాజస్థాన్ రైతులు కదం తొక్కారు. ట్రాక్టర్లతో ఢిల్లీకి ర్యాలీ తీసి ఢిల్లీ-జైపూర్ రోడ్డును దిగ్భంధించారు. తమ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అతివాద సంఘాలకు చెందిన వ్యక్తులు చర్చల్లో పాల్గొన్నారంటూ కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. మరోవైపు చర్చల సందర్భంగా రైతుల సంఘాల నేతలు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. బంగాళాదుంపలు, చెరకు, ఆహార ధాన్యాలు, కూరగాయలు సహా పాలు రైతు ఉత్పత్తులన్నింటికీ కనీస మద్ధతు ధర కోరుతున్నట్టు  తెలిపారు.  

అటు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రైతులకు మద్ధతు ధర అలాగే ఉంటుందని అందులో సందేహ పడాల్సిన అవసరమే లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కనీస మద్ధతు ధర ఇకముందు కొనసాగుతుందని రైతులతో చర్చలు కూడా ఉంటాయన్నారు. మొదట 31 సంఘాలకు చెందిన నేతలు చర్చలకు వచ్చారని ఆ తర్వాత 35సంఘాలుగా మారాయని చివరకు 37సంఘాల నేతలతో చర్చల్లో పాల్గొన్నారన్నారు. హర్యానా రైతు సంఘం నేతలతో సమావేశమైన వ్యవసాయ మంత్రి తోమర్ రైతులతో చర్చించారు.







పీసీసీ అధ్యక్ష పదవిపై కసరత్తు... రెండు వర్గాలుగా సీనియర్లు

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>