HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-update8759e58b-7ad6-441b-896c-d17c3b13a9e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-update8759e58b-7ad6-441b-896c-d17c3b13a9e3-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కొన్ని దేశాల వ్యాక్సిన్లు ప్రయోగాల దశలలో మంచి ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని వికటిస్తున్నాయి. తాజాగా వాటిలో ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కూడా చేరింది. ఈ వ్యాక్సిన్‌ వినియోగంలో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేశారు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీదారులు ఓ ప్రకటన విడుదల చేశారుcorona vaccine;australia;telugu;university;contract;hivఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలలో HIV కలకలం!ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలలో HIV కలకలం!corona vaccine;australia;telugu;university;contract;hivSun, 13 Dec 2020 11:30:00 GMTప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కొన్ని దేశాల వ్యాక్సిన్లు ప్రయోగాల దశలలో మంచి ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని వికటిస్తున్నాయి. తాజాగా వాటిలో ఆస్ట్రేలియా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కూడా చేరింది. ఈ వ్యాక్సిన్‌ వినియోగంలో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు గుర్తించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేశారు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీదారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ, CSL‌ ఔషధ సంస్థ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌లో (Australia Covid-19 Vaccine) తొలి దశలో ఈ టీకా ఆశాజనక ఫలితాలు ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కానీ, రెండు, మూడో దశలో కొంత మంది వలంటీర్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులకు గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, అవి అంత ప్రమాదకరమైనవేమీ కావని స్పష్టం చేశారు. అయినప్పటికీ ముందస్తు చర్యగా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను, అభివృద్ధిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
 




ఈ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలే వచ్చాయి. టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నాయి. కానీ, రెండు, మూడో దశలో కొన్ని షాకింగ్ అంశాలను గుర్తించారు. అదేమంటే.. ఈ వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో కలగజేసుకుంటున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం వల్ల hiv లేనివారికి కూడా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. అయితే.. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో మాత్రమే ప్రభావం చూపుతున్నాయని.. అలాగని ఆ వ్యక్తులకు హెచ్‌ఐవీ సోకినట్లు కాదని స్పష్టం చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారికి హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ అని తేలినట్లు వివరించారు.



ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే ఈ టీకాను కొనుగోలు చేసేందుకు సీఎస్‌ఎల్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందంతో ఆ సంస్థకు దాదాపు 75 మిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరేది. కానీ, ప్రయోగాలు రద్దు చేయడంతో దానికి బ్రేక్ పడింది. ‘టీకా అభివృద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయడం కఠినమైన నిర్ణయమే. అయినప్పటికీ కొందరిలో గుర్తించిన ప్రతికూల మార్పుల వల్ల ఇది తప్పడం లేదు’ అని సీఎస్‌ఎల్‌ పేర్కొంది. మరోవైపు.. ఆస్ట్రేలియా ‘ఫైజర్’తో పాటు మరికొన్ని సంస్థలతోనూ వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంది. దీంతో సీసీఎల్ వ్యాక్సిన్ ప్రయోగాలు రద్దయినా.. ప్రజలకు టీకా అందించడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ ప్రజల నిరీక్షణకు ఎప్పుడు తెరదిగనుందో చూడాలి....




మహేశ్ డైరెక్టర్ ఆ సినిమా మొదలు పెట్టనున్నాడా ?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>