PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updates26318ab7-1b74-4ae1-b472-4befc3ba4f71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updates26318ab7-1b74-4ae1-b472-4befc3ba4f71-415x250-IndiaHerald.jpgఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త.. కొత్త సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు. కానీ ఆయన తీసుకునే పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రజలలో కొంత వ్యతిరేకత నెలకోనెట్టుగా ఉన్నాయి.రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తా అన్న సి‌ఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి కి చెందిన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గత కొంత కాలంగా అమరావతి నే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిసర వాసులు ఉద్యమాన్ని చేపట్టారుlatest updates;manu;jagan;amaravati;guntur;andhra pradesh;vishakapatnam;capital;chief minister;jac;reddy;yatraసి‌ఎం జగన్.. ఇదేమీ ఆలోచనయ్యా !!సి‌ఎం జగన్.. ఇదేమీ ఆలోచనయ్యా !!latest updates;manu;jagan;amaravati;guntur;andhra pradesh;vishakapatnam;capital;chief minister;jac;reddy;yatraSun, 13 Dec 2020 09:00:00 GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త.. కొత్త సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తున్నారు. కానీ ఆయన తీసుకునే పలు నిర్ణయాలు రాష్ట్ర ప్రజలలో కొంత వ్యతిరేకత నెలకోనెట్టుగా ఉన్నాయి.రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తా అన్న సి‌ఎం జగన్ నిర్ణయాన్ని అమరావతి కి చెందిన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.గత కొంత కాలంగా అమరావతి నే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిసర వాసులు ఉద్యమాన్ని చేపట్టారు.

సి‌ఎం జగన్ అమరావతి ని కార్యనిర్వాహక రాజధానిగాను, కర్నూల్ ను న్యాయ శాఖ రాజధానిగాను, విశాఖపట్నంను పారిశ్రామిక రాజధానిగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపద్యంలో అమరావతి వాసులు అమరావతి ని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానులు వద్దని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.ఇందులో భాగంగా చేపట్టిన ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు.అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని... సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని నినాదాలు చేశారు. డిసెంబరు 17నాటికి ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు గుంటూరులో శనివారం మహాపాదయాత్ర నిర్వహించారు.

 మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభమైన ఈ యాత్రలో వేలసంఖ్యలో రైతులు, మహిళలతో పాటు పెద్దఎత్తున విద్యార్థి, యువజన, కుల సంఘాల నేతలు, వివిధ వ్యాపార ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర రెండు గంటల పాటు యాత్ర కొనసాగింది. శుభం కల్యాణ మండపం నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు మహాపాదయాత్ర నిర్వహించి అక్కడే భారీ మానవహారంగా ఏర్పడ్డారు. అమరావతికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళలు ఆక్షేపించారు. మరి ఏపీ సి‌ఎం జగన్ రాష్ట్ర రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడో చూడాలి..


మ‌ళ్లీ బాలాకోట్‌లో ఉగ్ర‌వాద శిక్ష‌ణ‌... వీడియోలో భార‌త్ గురించి విద్వేషం..

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>