PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluru-zone-situation4678a0d8-ac64-4b78-b0e1-80d992851161-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluru-zone-situation4678a0d8-ac64-4b78-b0e1-80d992851161-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని ఓ వింత వ్యాధితో చాలా మంది జనాలు అస్వస్థకు గురై చనిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా, గుంటూరుకి కూడా ఈ వ్యాధి వ్యాపించింది. గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలంలో నడికుడిలోనూ కొందరు అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేగుతోంది. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు అంటున్నారు.ఒకరి తర్వాత ఒకరుగా పలువురు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారeluru;ramakrishna;india;godavari river;guntur;district;west godavari;mandalam;village;letter;cow slaughter;local language;central government;eluru;vగుంటూరులోనూ వణికిస్తున్న ఏలూరు వింతవ్యాధి....గుంటూరులోనూ వణికిస్తున్న ఏలూరు వింతవ్యాధి....eluru;ramakrishna;india;godavari river;guntur;district;west godavari;mandalam;village;letter;cow slaughter;local language;central government;eluru;vSun, 13 Dec 2020 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని ఓ వింత వ్యాధితో చాలా మంది జనాలు అస్వస్థకు గురై చనిపోతున్న  విషయం తెలిసిందే. తాజాగా, గుంటూరుకి కూడా ఈ వ్యాధి వ్యాపించింది. గుంటూరు  జిల్లాలోని దాచేపల్లి మండలంలో  నడికుడిలోనూ కొందరు అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేగుతోంది. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల  నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్థులు అంటున్నారు.ఒకరి తర్వాత ఒకరుగా పలువురు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.


నడికుడికి చెందిన పల్లపు రామకృష్ణ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతరం గుంటూరు వైద్యశాలకు తరలించారు.అలాగే అదే గ్రామంలో మరో ఇద్దరు యువకులు కూడా స్పృహ తప్పి పడిపోవడంతో భయం చుట్టుకుంది.


ఇక అంతుచిక్కని వింతవ్యాధి వ్యాధి బాధితుల సంఖ్య ఏలూరులో తగ్గింది. శనివారం ఈ లక్షణాలతో నలుగురు ఆసుపత్రిలో చేరారు. బాధితుల సంఖ్య తగ్గినా.. వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర వైద్య బృందాల నివేదికలో బియ్యం, కూరగాయలు, పాలలో లోహాలు, రసాయనాల అవశేషాలు ఉన్నాయని చెప్పడంతో.. ఈ అంశంపై చర్చ సాగుతోంది. పాలు, బియ్యం, కూరగాయలు అందరూ ఉపయోగిస్తుంటే ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రమే ఎందుకు ఈ వ్యాధి బారిన పడ్డారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పాడి పశువులు అయినా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల నుంచి 24 నమూనాలు సేకరించి.. వాటిని హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్‌ ల్యాబొరేటరీకి పంపినట్టు పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.పాలు, బియ్యం, కూరగాయల్లోకి ఈ తరహా ప్రమాదకర రసాయనాలు ఎలా ప్రవేశించాయనే ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం రాలేదు.ఇక ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>