MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sakshi-rangarao1dabeb01-2b00-413c-8aeb-3ca53460a44c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sakshi-rangarao1dabeb01-2b00-413c-8aeb-3ca53460a44c-415x250-IndiaHerald.jpgసెప్టెంబర్ 19, 1945 వ సంవత్సరంలో గుడివాడ సమీపంలోని కొండిపర్రు గ్రామంలో లక్ష్మీనారాయణ, రంగనాయకమ్మ దంపతులకు రంగావఝ్ఝల రంగారావు జన్మించారు. ఆయన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో స్టెనోగ్రాఫర్ గా కొన్నేళ్ళపాటు పనిచేశారు.sakshi rangarao;bhanu;bhanumathi old;kushi;ramana;vamsi;visakhapatnam;amarnath cave temple;tollywood;cinema;vishakapatnam;kanna lakshminarayana;village;september;comedy;turmeric;comedian;heroine;june;sakshi;jandhyala ravishankar;fidaa;chitramప్రముఖ నటుడు సాక్షి రంగారావు కొడుకు టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ అని మీకు తెలుసా..?ప్రముఖ నటుడు సాక్షి రంగారావు కొడుకు టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ అని మీకు తెలుసా..?sakshi rangarao;bhanu;bhanumathi old;kushi;ramana;vamsi;visakhapatnam;amarnath cave temple;tollywood;cinema;vishakapatnam;kanna lakshminarayana;village;september;comedy;turmeric;comedian;heroine;june;sakshi;jandhyala ravishankar;fidaa;chitramSun, 13 Dec 2020 14:08:15 GMTసెప్టెంబర్ 19, 1945 వ సంవత్సరంలో గుడివాడ సమీపంలోని కొండిపర్రు గ్రామంలో లక్ష్మీనారాయణ, రంగనాయకమ్మ దంపతులకు రంగావఝ్ఝల రంగారావు జన్మించారు. ఆయన విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో స్టెనోగ్రాఫర్ గా కొన్నేళ్ళపాటు పనిచేశారు. అప్పటికే అతనికి కళలపై నాటకాలపై చాలా ఆసక్తి ఉండేది. ఉద్యోగం చేస్తూనే మరోవైపు స్టేజీల పై ఎన్నో నాటకాల్లో ఆయన నటించారు. రంగస్థలం మీద ఆయన డైలాగులు చెప్పే తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవి. ఒకరోజు దర్శకుడు బాపు రమణ.. రంగారావు ప్రతిభను గుర్తించారు. తాను దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో కరణం అనే పాత్రను కూడా ఇచ్చారు. అప్పటికి రంగారావు కి 25 సంవత్సరాలు కాగా.. ఒక మొదటిసారిగా వచ్చిన పాత్రలో అద్భుతంగా నటించిన వావ్ అనిపించారు. 1967 లో విడుదలైన ఈ చిత్రం రంగారావు యొక్క అసలు ఇంటి పెరైనా రంగావఝ్ఝల ను సాక్షి గా మార్చేసింది. అప్పటి నుంచి రంగారావుని సాక్షి రంగారావు గా పిలవడం ప్రారంభించారు. హీరోయిన్ భానుమతి మాత్రం సాక్షి రంగారావు ని పసుపుకొమ్ము అని పిలుస్తుంటారు. ఆమె నటించిన "మట్టిలో మాణిక్యం" సినిమాలో సాక్షి రంగారావు విలన్ గా నటించి మెప్పించారు.

తన కెరీర్ మొత్తంలో 450 పైచిలుకు సినిమాలో సాక్షి రంగారావు నటించారు. సహాయ నటుడిగా, కమెడియన్ గా, ప్రతినాయకుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విభిన్నమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఆయన పోషించిన కామెడీ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి. 1986లో జంధ్యాల తెరకెక్కించిన రెండు రెళ్ళ ఆరు చిత్రంలో సాక్షి రంగారావు అద్భుతంగా నటించేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మూవీలో 150 కిలోమీటర్ల వేగంతో మాట్లాడాలని జంధ్యాల చెప్పగానే ఓకే అనేసి సాక్షి రంగారావు సూపర్ ఫాస్ట్ గా డైలాగులు చెప్పి అందరినీ ఫిదా చేసేసారు. స్వర్ణకమలం సినిమాలో హాస్య నటి శ్రీలక్ష్మీ భర్తగా సాక్షి రంగారావు నటించారు. ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు కడుపుబ్బా నవ్వించాయి. ఏ క్యారక్టర్ లోనైనా పరకాయ ప్రవేశం చేసి స్వీయ అనుభవం ఉన్నట్టు పాత్రకు తగ్గట్టు నటించడంలో సాక్షి రంగారావు బాగా నైపుణ్యం పొందారు.

ఇకపోతే సాక్షి రంగారావు లోని నటనను కె.విశ్వనాథ్, వంశీ, జంధ్యాల, బాపు-రమణ దర్శకులు బాగా పిండేసుకున్నారని చెప్పుకోవచ్చు. సాగరసంగమం, శంకరాభరణం, బంగారు పిచ్చుక వంటి సినిమాలో ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటించి గొప్ప నటుడిగా సాక్షి రంగారావు పేరొందారు. ఏప్రిల్ 1 సినిమాలో రంగారావు నటనకు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. ఐతే కామెడీ సినిమాల ద్వారా నవ్వించిన రంగారావు మంచుపల్లకి సినిమాలో ప్రేక్షకులను బాగా ఏడిపించారు. ఇకపోతే ఆయన ‘కన్యాశుల్కం’ నాటకం రిహార్సల్స్‌లో నటిస్తూ 2005, మే 5వ తేదీస్టేజ్‌మీదే కుప్పకూలిపోయారు. అనంతరం ఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 27న తన తుది శ్వాస విడిచారు.


బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>