MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-support-to-prabhas-becomes-news0951f91d-1c9f-4035-84c0-71fc7412a58c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rana-support-to-prabhas-becomes-news0951f91d-1c9f-4035-84c0-71fc7412a58c-415x250-IndiaHerald.jpgప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీల స్థానానికి ఎప్పుడో ఎదిగిపోయాడు. దీనితో అతడితో తీసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం ‘కెజిఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ తో కలిసి ‘సలార్’ మూవీలో నటిస్తున్న ఈ మూవీ ప్రాజెక్ట్ లో ఈ మూవీ మార్కెట్ కోసం ఇప్పుడు మోహన్ లాల్ రానా లు ఎంటర్ అవ్వడం హాట్ న్యూస్ గా మారింది.ఈమూవీకి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ ఇవ్వడంతో ఈమూవీ కథలో ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలprabhas;prabhas;rana;mohanlal;editor mohan;prasanth;prashanth neel;hyderabad;india;cinema;kannada;chennai;vegetable market;kgf;prasanth neel;gangster;prashant kishor;masala;massప్రభాస్ కు మోహన్ లాల్ రానా ల సపోర్ట్ !ప్రభాస్ కు మోహన్ లాల్ రానా ల సపోర్ట్ !prabhas;prabhas;rana;mohanlal;editor mohan;prasanth;prashanth neel;hyderabad;india;cinema;kannada;chennai;vegetable market;kgf;prasanth neel;gangster;prashant kishor;masala;massSun, 13 Dec 2020 10:00:00 GMTప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీల స్థానానికి ఎప్పుడో ఎదిగిపోయాడు. దీనితో అతడితో తీసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాణం అవుతున్నాయి. ప్రస్తుతం ‘కెజిఎఫ్’  ఫేమ్ ప్రశాంత్ నీల్‌ తో కలిసి ‘సలార్’ మూవీలో నటిస్తున్న ఈ మూవీ ప్రాజెక్ట్ లో ఈ మూవీ మార్కెట్ కోసం ఇప్పుడు మోహన్ లాల్ రానా లు ఎంటర్ అవ్వడం హాట్ న్యూస్ గా మారింది.


ఈమూవీకి ‘ది మోస్ట్ వైలెంట్ మెన్ కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వైలెంట్’ అనే శక్తివంతమైన క్యాప్షన్ ఇవ్వడంతో ఈమూవీ కథలో ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో ప్రభాస్ లుక్ అతడి బాడీ లాంగ్వేజ్ చాల డిఫరెంట్ స్టైల్ లో ఉంటూ ప్రశాంత్ నీల్ స్టైల్ లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా కథ రీత్యా ప్రభాస్ గ్యాంగ్ స్టర్ పాత్రలతో పాటు మరో రెండు గ్యాంగ్ స్టర్ పాత్రలు కీలకంగా ఉంటాయని ఆ రెండు పాత్రలకు మోహన్ లాల్ రానా లు ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన మళయాళ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని మోహన్ లాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.



ఇది ఇలా ఉండగా ఈ సినిమాలోని ఆర్టిస్టుల కోసం ఈ నెల 15న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ నిర్వహించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. బెంగళూరు చెన్నై నగరాలలో కూడా త్వరలో ఆడిషన్స్ ఉంటాయి అని టాక్. ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులలో మోహన్ లాల్ కు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని కూడ ఈ మూవీలో మోహన్ లాల్ ను ఎంపిక చేసినట్లు టాక్. గతంలో కన్నడం లో ప్రశాంత్ నీల్ తీసిన ‘ఉగ్రం’ సినిమా కథకు కొన్ని మార్పులు చేసి అదే కథను ఇప్పుడు ప్రభాస్ తో ‘సలార్’ గా తీస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..




హిట్ సినిమాలు చేస్తున్నా నభా స్టార్ అవలేకపోతుందా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>