PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-vijayashanthi-fires-on-cm-kcra5601313-a210-4e35-bc95-3cb10f357063-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-vijayashanthi-fires-on-cm-kcra5601313-a210-4e35-bc95-3cb10f357063-415x250-IndiaHerald.jpgమోసాల కేసీఆర్ ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సీఎంగా తన ప్రోటోకాల్ తో అపాయింట్మెంట్ తీసుకుని ప్రజలను బకరాలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్ అవినీతి ఆరోపణలు రుజువు అవుతాయని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసారు kcr;amit shah;kcr;vijayashanti;thirtha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;media;cm;parliment;twitter;assembly;minister;letter;central government;medak;partyప్రజలను బకరాలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నంప్రజలను బకరాలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నంkcr;amit shah;kcr;vijayashanti;thirtha;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;media;cm;parliment;twitter;assembly;minister;letter;central government;medak;partySun, 13 Dec 2020 22:12:52 GMTకాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయ శాంతి తన దూకుడు పెంచారు. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై విమర్శల జోరు పెంచారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటనపై విజయ శాంతి విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. గజ్వేల్, సిద్దిపేటలపై వందల వేల కోట్ల విలువైన వరాలు కురిపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ అంటే ఈ రెండు ప్రాంతాలు మాత్రమేనా?  అంటూ ఫైర్ అయిన  విజయశాంతి  తాజాగా  మరోసారి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

ఈ సారి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై విజయశాంతి  స్పందించారు. మోసాల కేసీఆర్ ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ట్వీట్ చేసారు. సీఎంగా తన ప్రోటోకాల్ తో అపాయింట్మెంట్ తీసుకుని ప్రజలను బకరాలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్ అవినీతి ఆరోపణలు రుజువు అవుతాయని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు.

కాగా 2009 లో టీఆర్ఎస్ తరపున మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన విజయశాంతి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలో పెద్దగా క్రీయాశీలకంగా వ్యవహరించలేరు. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో విజయశాంతి డిసెంబరు 6న ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. డిసెంబరు 7న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.




నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>