MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mishan-impossible-poster-meeda-vivadam903f6ec7-5fc3-43ef-a745-bcab0a7e9a3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mishan-impossible-poster-meeda-vivadam903f6ec7-5fc3-43ef-a745-bcab0a7e9a3d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా క్రమంగా తన రూపు మార్చుకుంటుంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఫైట్స్, ఒక ఐటమ్ సాంగ్, నాలుగు లవ్ సీన్స్ అన్నట్టు ఉండేది. కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాల రంగప్రవేశంతో తెలుగులో కూడా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను అలాగే విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం పెరిగింది. అదే కోవలో వచ్చిన సినిమాలు చాలానే విజయం సాధించాయి అందులోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా ఒకటి. ఆ సినిమా దర్శకుడు స్వరూప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. మిషన్ ఇంపాజిబుల్ పేరుtollywood;shiva;atreya;deva;geetha;srinivas;cinema;sangeetha;telugu;december;love;sri krishna;lord siva;hero;heroine;posters;hero heroine;agent sai srinivasa athreyaమిషన్ ఇంపాజిబుల్ పోస్టర్ మీద వివాదం..మిషన్ ఇంపాజిబుల్ పోస్టర్ మీద వివాదం..tollywood;shiva;atreya;deva;geetha;srinivas;cinema;sangeetha;telugu;december;love;sri krishna;lord siva;hero;heroine;posters;hero heroine;agent sai srinivasa athreyaSun, 13 Dec 2020 08:00:00 GMTతెలుగు సినిమా క్రమంగా తన రూపు మార్చుకుంటుంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఫైట్స్, ఒక ఐటమ్ సాంగ్, నాలుగు లవ్ సీన్స్ అన్నట్టు ఉండేది. కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాల రంగప్రవేశంతో తెలుగులో కూడా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను అలాగే విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం పెరిగింది. అదే కోవలో వచ్చిన సినిమాలు చాలానే విజయం సాధించాయి అందులోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా ఒకటి. ఆ సినిమా దర్శకుడు స్వరూప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

 మిషన్ ఇంపాజిబుల్ పేరుతో నిన్న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రిలీజ్ పోస్టర్ కు సంబంధించి శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుల గెటప్ లో ఉన్న ముగ్గులు చిన్న పిల్లలు వాళ్ల చేతుల్లో తుపాకులు పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ టైటిల్ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో పాటు పోస్టర్ కూడా ఇంకాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే దేవుడు గెటప్ లో ఉన్న చిన్న పిల్లల చేతిలో గన్స్ పెట్టడం అనే అంశం మీద ఇప్పుడు వివాదం చెలరేగింది. 

హిందూ సంఘాలకు చెందిన వారు కొంతమంది సోషల్ మీడియాలో ఈ అంశం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు పడితే వారు హిందూ సమాజం మీద ఇలాంటి సినిమాలు తీస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే అసలు ఈ గన్స్ ఎందుకు పెట్టారు ఏమిటి అనే సినిమా రిలీజ్ అయితే గాని తెలియదు కానీ ఒక పోస్టర్ ను ఆధారంగా చేసుకుని వారైతే కామెంట్స్ గుప్పించడం గమనార్హం. ఇక  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతోందని సమాచారం. ఈ సినిమాకు రాబిన్ సంగీతం అందిస్తుండగా హీరో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి దాకా సరైన క్లారిటీ లేదు. సినిమా టైటిల్ అలాగే పోస్ట్ ను బట్టి చూస్తే ఇది ఏమైనా చిన్న పిల్లల సినిమా అనే అనుమానాలు కూడా వ్యక్తం కావడం గమనార్హం




పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>